శత్రువులుగా మారుతున్న మిత్రులు.. కారణం ఆ దర్శకుడేనట..

తెలుగు స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, మంచు మనోజ్‌లు మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే.

news18-telugu
Updated: July 3, 2020, 1:42 PM IST
శత్రువులుగా మారుతున్న మిత్రులు.. కారణం ఆ దర్శకుడేనట..
మంచు మనోజ్, ఎన్టీఆర్ Photo : Twitter
  • Share this:
తెలుగు స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, మంచు మనోజ్‌లు మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి తోడు వారి కుటుంబాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. మోహన్ బాబు సీనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే. ఎప్పుడూ అన్నగారు అన్నగారు అంటూ ఉండేవారు. ఇక మనోజ్, ఎన్టీఆర్‌లు ఒకే సంవత్సరం, ఒకే రోజున కొన్ని గంటల వ్యవధిలో జన్మించారట. మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో మేజర్ చంద్రకాంత్‌ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్‌‌కు జూనియర్ తన తాతతో పాటు వచ్చేవారట. అప్పుడే మనోజ్‌కు జూనియర్‌కు మధ్య పరిచయం ఏర్పడగా.. ఆ తరువాత నుండి అలా వారి స్నేహం కొనసాగింది. ఇప్పుడు ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈ ఇద్దరూ శత్రువులుగా మారబోతున్నారు. అయితే ఇది నిజ జీవితంలో కాదు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌లో ఉండగానే ఆయన త్రివిక్రమ్‌తో మరో సినిమాకు ఓకే చెప్పాడు. #ntr30గా వస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అందులో భాగంగా ఈ సినిమాలో నటించే నటీనటులను ఎంచుకున్నాడట దర్శకుడు త్రివిక్రమ్‌. హీరోయిన్స్‌గా జాన్వీ కపూర్, పూజా హెగ్డేలను పరిశీలిస్తున్న త్రివిక్రమ్.. విలన్‌గా యువ నటుడు మంచు మనోజ్‌ను తీసుకోవాలని భావిస్తున్నాడట.

అందులో భాగంగా దీనికి సంబంధించి మనోజ్‌తో సంప్రదింపులు జరపడం, ఆయన కూడ తన మిత్రుడు సినిమాలో విలన్‌గా నటించడానికి ఓకే అవ్వడం జరిగిపోయాయని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది.  మనోజ్ ప్రస్తుతం 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మనోజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమాగా రాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌‌లు కలిసి నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించనున్నాడని సమాచారం.
First published: July 3, 2020, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading