Home /News /movies /

MANCHU MANOJ TWEET ON TRAGIC VIZAG POLYMERS GAS LEAK ISSUE AND PRAYS THE GOD FOR THEM PK

2020 మరీ ఇలా ఉందేంట్రా బాబూ.. మంచు మనోజ్ ట్వీట్..

మంచు మనోజ్ వైజాగ్ గ్యాస్ లీక్ (manchu manoj vizag gas leak)

మంచు మనోజ్ వైజాగ్ గ్యాస్ లీక్ (manchu manoj vizag gas leak)

Vizag Gas leak: చాలా మంది ఇదే అంటున్నారిప్పుడు. కొందరు అయితే సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుస్తున్నారు. దేవుడా 2020లో వైరస్ ఉంది.. క్లీన్ చేసి పంపవా అంటూ సెటైర్లు..

చాలా మంది ఇదే అంటున్నారిప్పుడు. కొందరు అయితే సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుస్తున్నారు. దేవుడా 2020లో వైరస్ ఉంది.. క్లీన్ చేసి పంపవా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం దేశం మొత్తం నిన్నటి వరకు కరోనా గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తెరిచిన వైన్ షాపుల గురించి చర్చించుకున్నారు. ఇప్పుడు విశాఖలో జరిగిన విష వాయువు లీకేజ్ దుర్ఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ముఖ్యంగా టాలీవుడ్‌ను కూడా విషాదంలో ముంచేసింది. బాధితుల పరిస్థితిపై సినీ ప్రముఖులు ఆందోళనకు గురవుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం


చిరంజీవి నుంచి అంతా ఈ దుర్ఘటనపై సోషల్ మీడియాలో స్పందన తెలియచేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. చనిపోయిన వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు హీరో మంచు మనోజ్ కూడా ఈ ఘటన గురించి ట్వీట్ చేసాడు. 2020 సంవత్సరం చాలా ఘోరంగా ఉందని చెప్పాడాయన. అసలే కరోనాతో చచ్చిపోతుంటే.. ఇప్పుడు నిద్ర లేవడమే చేదు వార్త వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదని ట్వీట్ చేసాడు మనోజ్.


ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. 2020 ఎందుకింత కష్టంగా ఉంది.. నిద్ర లేవడమే వైజాగ్‌లో ఎల్‌జీ పాలిమర్స్ వద్ద గ్యాస్ లీకేజీ అనే వార్త విన్నానని ట్వీట్ చేసాడు మనోజ్. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారని.. 5000 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారనే రిపోర్ట్ వింటుంటనే గుండె తరుక్కుపోతుంది. చనిపోయిన వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలి.. అలాగే అనారోగ్యం బారిన పడిన వాళ్లంతా త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు మనోజ్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Manchu Manoj, Telugu Cinema, Tollywood, Vizag gas leak

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు