Home /News /movies /

Manchu Manoj - New Look: మంచు హీరో నయా లుక్..2021లో కథ వేరుగా ఉంటదా..!

Manchu Manoj - New Look: మంచు హీరో నయా లుక్..2021లో కథ వేరుగా ఉంటదా..!

Manchu Manoj loses weight and shocks everyone with his new look

Manchu Manoj loses weight and shocks everyone with his new look

Manchu Manoj - New Look: హీరో మంచు మనోజ్‌ ఏకంగా పదిహేను కిలోల బరువు తగ్గారు. తన నయా లుక్‌ను ట్వీట్‌ చేసి ప్రేక్షకాభిమానులకు ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్‌ అభినందనలు తెలిపారు.

    కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌బాబు నట వారసులుగా సినీ రంగ ప్రవేశం చేసిన వారిలో మంచు మనోజ్‌ ఒకడు. తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో మనోజ్‌ వెయిట్‌ విపరీతంగా పెరిగాడు. ఈ పెరిగిన వెయిట్‌తో ఎలాగో మేనేజ్‌ చేసుకుంటూ సినిమాలు చేస్తూ వచ్చిన మనోజ్‌ 2017లో ఒక్కడు మిగిలాడు సినిమాలో నటించిన తర్వాత మరో సినిమా కోసం తెరపై కనిపించలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత తన ట్విట్టర్‌ ద్వారా మనోజ్‌ అభిమానులకు, ప్రేక్షకులకు షాకిచ్చాడు. ఇంతకీ మనోజ్‌ అందరికీ ఎలా షాకిచ్చాడో తెలుసా? లుక్‌ పరంగా..లావుగా ఉండే మనోజ్‌ ఏకంగా పదిహేను కిలోల బరువు తగ్గాడు. కొత్త లుక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు మనోజ్‌. ఈ మూడేళ్ల పాటు హైదరాబాద్‌లో కాకుండా తిరుపతిలోనే ఉన్నాడు మనోజ్‌. ప్రస్తుతం మంచు మనోజ్‌ శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో అహం బ్రహ్మాస్మి అనే ప్యాన్‌ ఇండియా సినిమాను నిర్మిస్తూ, నటిస్తున్నాడు. దీంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న మరో రెండు సినిమాల్లో నటించడానికి మనోజ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    దొంగదొంగది సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన మంచు మనోజ్‌.. హీరోగా తదనైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అడపా దడపా మంచి హిట్స్‌ కూడా సాధించాడు. అయితే అతన్ని స్టార్‌ హీరోగా నిలబెట్టే హిట్‌ మాత్రం దక్కలేదు. అదే సమయంలో అతని వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. భార్యతో విడిపోయాడు. ఈ విషయాన్ని మనోజ్‌ రహస్యంగా ఏమీ దాచలేదు. కారణాలు చెప్పలేదు.. కానీ భార్యతో విడిపోయిన విషయాన్ని బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. అప్పటి నుండి తిరుపతికే పరిమితమయ్యాడు. తిరుపతిలోని తమ విద్యా సంస్థలు శ్రీవిద్యానికేతన్‌ వ్యవహారాలు చూసుకోవడంతో పాటు కోవిడ్‌ సమయంలోనూ చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలకు తన వంతు సాయాన్ని అందిచండంలో ముందున్నాడు మనోజ్‌. ఒకానొక దశలో మనోజ్‌ రాజకీయ రంగప్రవేశం గురించి కూడా చర్చ జరిగింది.



    అలాగే మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్‌ సినిమాలు చేయడా? ప్రశ్న కూడా వచ్చింది. అయితే తాను కొన్నాళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉంటానని, త్వరలోనే మంచి కథలతో ముందుకు వస్తానని మనోజ్‌ తెలియజేశాడు. అన్నట్లుగానే మనోజ్‌ పదిహేను కిలలో బరువు తగ్గడమే కాకుండా కొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మనోజ్‌ కొత్త లుక్ చూసిన వారందరూ ఇకపై సినిమాల విషయంలో మనోజ్‌ కథ వేరే ఉంటుందా? అని అనుకుంటు్న్నారు.
    Published by:Anil
    First published:

    Tags: Manchu Family, Manchu Manoj

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు