హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి.. ఆన్సర్ అదిరింది..

Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి.. ఆన్సర్ అదిరింది..

మంచు మనోజ్ (Manchu Manoj)

మంచు మనోజ్ (Manchu Manoj)

Manchu Manoj: మంచు మనోజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈయన సోషల్ మీడియాలో అభిమానులతో ఛాటింగ్ చేస్తూ రెండో పెళ్లి గురించి మాట్లాడాడు. అభిమాని అడిగిన ప్రశ్నకు తన వైపు నుంచి సమాధానం చెప్పాడు మనోజ్. రెండో పెళ్లితో పాటు సినిమాల గురించి కూడా ఓపెన్ అయ్యాడు ఈ హీరో.

ఇంకా చదవండి ...

మంచు మనోజ్ విడాకులు తెలుగు ఇండస్ట్రీలో ఓ సంచలనం. అప్పటి వరకు అంతా సవ్యంగా ఉన్నా కూడా ఉన్నట్లుండి బాంబు పేల్చాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు మంచు వారబ్బాయి. దాంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. దానికితోడు కొన్నేళ్లుగా సినిమాలు కూడా చేయట్లేదు మనోజ్. విడాకుల తర్వాత కూడా ఒక్కడే ఉంటున్నాడు. ఫ్యామిలీకి కూడా దూరంగానే ఉంటున్నాడు మనోజ్. ఇలాంటి సమయంలో మళ్లీ సినిమాలే చేస్తానంటూ అనౌన్స్ చేసాడు. సొంతంగా నిర్మాణ సంస్థను మొదలుపెట్టి వరసగా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు ఈయన. భార్య ప్రణతికి దూరమైన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు మనోజ్.

అప్పటి నుంచి తన జీవితంలోని ప్రతీ విషయాన్ని కూడా అభిమానులతోనే నేరుగా పంచుకుంటున్నాడు ఈయన. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు. తను ఫైర్ బాల్‌గా వెలగడానికి అంతా రెడీ అయిందని.. ఈ వారంలో ఓ ఆసక్తికరమైన ప్రకటన తన నుంచి వస్తుందని ట్వీట్ చేసాడు మనోజ్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి కారణం కూడా లేకపోలేదు.. ఆసక్తికరమైన ప్రకటన అంటే కొంపదీసి రెండో పెళ్లి కానీ చేసుకుంటున్నాడా ఏంటి అంటూ అడుగుతున్నారు అభిమానులు. అందులో ఓ అభిమాని అయితే నేరుగా మనోజ్‌నే ప్రశ్నించాడు.

ఆసక్తికరమైన ప్రకటన అంటే.. ఏంటన్నా రెండో పెళ్లి చేసుకోబోతున్నావా ఏంటి.. కొత్త వదిన వస్తుందా.. కొత్త వదిన కోసం వెయిటింగ్ అన్నా అంటూ మనోజ‌్‌ను అడిగేసాడు. దీనికి మనోజ్ కూడా చాలా సరదాగా సమాధానం ఇచ్చాడు. వామ్మో అంటూ ఎమోజీస్ పెట్టాడు మనోజ్. దాంతో మనోజ్ చేసిన ట్వీట్ పెళ్లి గురించి కాదని క్లారిటీ వచ్చేసింది. ఈ ప్రకటన తన పెళ్లి గురించి కాదని.. ఇకపై తాను ఒంటరి అంటున్నాడు ఈయన. సినిమా గురించి చెప్పబోతున్నాడు మంచు వారసుడు. ముఖ్యంగా ఇప్పటికే రెండు మూడు కథలు విన్నాడు ఈయన. వరసగా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు.

మంచు మనోజ్ (Manchu Manoj)
మంచు మనోజ్ (Manchu Manoj)

అందులో ఒకటి వెబ్ సిరీస్ అనుభవం ఉన్న దర్శకుడితో చేయబోతున్నాడు మనోజ్. అది కూడా సొంతం నిర్మాణంలోనే సినిమా చేయబోతున్నాడు. ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మనోజ్ మళ్లీ సినిమాలు చేయలేదు. ఆ మధ్య రిటైర్మెంట్ అంటూ ప్రకటించాడు ఈయన.. అప్పట్లో జోక్ అనుకున్నా తర్వాత అది సీరియస్ అయింది. అయితే విడాకుల తర్వాత మళ్లీ సినిమాలే తన ప్రపంచం అంటున్నాడు మంచు మనోజ్.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Manchu Manoj, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు