
మంచు మనోజ్, ఎన్టీఆర్ Photo : Twitter
NTR 30: ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాగ్రౌండ్లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాగ్రౌండ్లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే NTR30 పేరుతో వస్తోన్న ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రధాన విలన్‌గా కనిపించనున్నాడని ఇటీవల ఓ వార్త హల్ చల్ చేసింది. ప్రాణ మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరూ శత్రువులుగా మారబోతున్నారని.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడని.. త్రివిక్రమ్ ఆ పాత్ర కోసం మంచు మనోజ్‌ను సంప్రదించడం.. ఆయన దానికి ఓకే చెప్పడం జరిగిందని ఆ వార్తల సారాంశం. దాదాపు 3 రోజులు పాటు ఈ పుకారు బ్రహ్మాండంగా చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించాడు మనోజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ వార్తల్నీ ఖండించాడు. ఎన్టీఆర్ సినిమా నుంచి తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టంచేశాడు. విలన్ పాత్రలకు తను వ్యతిరేకం కాదని, అయినప్పటికీ ఇప్పటికిప్పుడు విలన్ పాత్రలో కనిపించే ఉద్దేశం తనకు లేదని అంటున్నాడు మనోజ్. "ఒక్కడు మిగిలాడు" అనే సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నా మనోజ్.. తాజాగా అహం బ్రహ్మస్మి అనే ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తూ, తానే సొంతంగా నిర్మిస్తున్నాడు.
Published by:Suresh Rachamalla
First published:July 07, 2020, 08:58 IST