హోమ్ /వార్తలు /సినిమా /

ఆ బుల్లెట్లను దాచుకోవాలనుంది.. మంచు మనోజ్ భావోద్వేగ ట్వీట్..

ఆ బుల్లెట్లను దాచుకోవాలనుంది.. మంచు మనోజ్ భావోద్వేగ ట్వీట్..

దిశాకు నివాళులు అర్పించిన మంచు మనోజ్

దిశాకు నివాళులు అర్పించిన మంచు మనోజ్

షాద్‌నగర్ దిశా హత్య కేసులో నిందితులను పోలీసులు ఈరోజు తెల్లవారుఝామున  3.30 గంటలకు ఎన్‌కౌంటర్ చేశారు. తాజాగా మంచు మనోజ్ దిశా నిందితుల ఎన్‌కౌంటర్ పై స్పందించారు.

షాద్‌నగర్ దిశా హత్య కేసులో నిందితులను పోలీసులు ఈరోజు తెల్లవారుఝామున  3.30 గంటలకు ఎన్‌కౌంటర్ చేశారు. మొత్తం నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద దిశాను పాశవికంగా అత్యాచారం చేసి చంపిన చోటే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసారు.  పోలీసులు వివరాల ప్రకారం.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అంతేగాక పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దాంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఘటనా ప్రదేశానికి వెళ్లగానే నలుగురు నిందితులూ.. ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురి మృతదేహాలను షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు సైతం గాయపడినట్లు తెలుస్తోంది. దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ సినీ నటులు ఈ ఘటనపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్‌కౌంటర్ పై మంచు మనోజ్ కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు. నిందితులను చంపిన బుల్లెట్టను దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా ? ఈ రోజే చెల్లెమ్మ దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని మనోజ్ ట్వీట్ చేసాడు. ఇటీవలె దిశ కుటుంబ సభ్యులను మనోజ్ పరామర్శించిన సంగతి తెలిసిందే కదా.

First published:

Tags: Disha, Disha murder case, Manchu Manoj

ఉత్తమ కథలు