Manchu Manoj Mega Hero | మెగా హీరోతో మంచు మనోజ్ క్రేజ్ మల్టీస్టారర్ చేయనున్నాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. తాజాగా ఈ మల్టీస్టారర్ పై మంచు మనోజ్ ట్వీట్ చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్‌లతో మంచు మనోజ్ మంచి స్నేహమే ఉంది. ఆ స్నేహంతోనే రామ్ చరణ్.. ఆ మధ్య మంచు మనోజ్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే కదా. మంచు మనోజ్ కేవలం రామ్ చరణ్‌తోనే కాదు.. సాయి ధరమ్ తేజ్‌తో కూడా మంచి స్నేహం ఉంది. ఈ రోజు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపుతూ.. ఈ రోజుతో ‘బిల్లా రంగా’ సినిమా విడుదలైన 38 యేళ్లు కంప్లీటైంది. ఈ సందర్భంగా ఈ సినిమా మల్టీస్టారర్.. సాయి ధరమ్ తేజ్‌తో చేయాలని ఉందంటూ అర్ధం వచ్చేలా ట్వీట్ చేసాడు. చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘బిల్లా రంగా’ సినిమాను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనున్నట్టు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు.
Happy Birthday babai @IamSaiDharamTej 🎂
and coincidentally, the biggest blockbuster multi starrer of that time #BillaRanga completed 38 years 😍
I think this says something to us babai 😜
Nenu ready... Nuvvu ready ah? 🤗❤️ pic.twitter.com/iQQJGhYwfg
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 15, 2020
ముందుగా మంచు మనోజ్, రామ్ చరణ్‌తో ఈ మల్టీస్టారర్ చేయాలని ఉందని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. రామ్ చరణ్ కూడా ఈ మల్టీస్టారర్‌ను రీమేక్ చేస్తే.. అందులో తన తండ్రి పాత్రలో నటించాలని ఉందని ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసాడు. కానీ ఇపుడు ఆ మల్టీస్టారర్‌ను సాయి ధరమ్ తేజ్‌తో చేయాలని ఉన్నట్టు మంచు మనోజ్ ట్వీట్ చేయడం విశేషం.
బిల్లా రంగా చిత్ర విషయానికొస్తే.. చిరంజీవి, మోహన్ బాబు తండ్రి కొడుకులుగా ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసారు. కే.యస్.ఆర్.దాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పింజల నాగేశ్వరరావు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న యాక్షన్ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది.
ఇక ‘బిల్లా రంగా’ రీమేక్ విషయమై కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఈ రీమేక్ విషయమై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా రీమేక్ చేస్తే.. చూడాలనకునే ప్రేక్షకులు ఉన్నారు. మొత్తానికి మెగా హీరోను ఒప్పించి ‘బిల్లా రంగా’ రీమేక్‌ను మంచు మనోజ్ పట్టాలెక్కిస్తాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Manchu Manoj, Mohan Babu, Ram Charan, Sai Dharam Tej, Tollywood