Home /News /movies /

MANCHU MANOJ CONTROLLED MOHAN BABU IN MAA ELECTIONS SAYS ACTORS AK

MAA Elections 2021: మా ఎన్నికల్లో రియల్ హీరో అతడే.. ఆ ఒక్కడు లేకపోతే ఇంకా రచ్చ జరిగేదా ?

మంచు మనోజ్ (ఫైల్ ఫోటో)

మంచు మనోజ్ (ఫైల్ ఫోటో)

MAA Elections: మా ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రంలో ఎంత హైడ్రామా నడిచిందో అంతా కళ్లారా చూశారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  మా ఎన్నికలు ముగిశాయి. అయితే ఆ ఎన్నికల రచ్చ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు, ఓడిన వాళ్లు.. తమ వాదన వినిపిస్తున్నారు. ఈ సమయంలోనూ ఇతరులను టార్గెట్ చేసేలా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వాళ్లు తమ పదవులకు రాజీనామా చేయడం మా ఎన్నికల పర్వంలో సరికొత్త ట్విస్ట్. ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామా తరువాత ఈ మొత్తం వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది. ఇదిలా ఉంటే మా ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రంలో ఎంత హైడ్రామా నడిచిందో అంతా కళ్లారా చూశారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ రోజు ఆ ఒక్కడు లేకపోయి ఉంటే.. మా ఎన్నికల వ్యవహారం మరింత రచ్చగా మారి ఉండేదని కొందరి మాటలను బట్టి తెలుస్తోంది.

  ఆ ఒక్కడు ఎవరో కాదు. మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్. మా ఎన్నికల సమయంలో తన అన్న మంచు మనోజ్ ప్యానల్‌కు మద్దతుగా తండ్రి మోహన్ బాబుతో కలిసి అక్కడే ఉన్నాడు మనోజ్. ఈ సందర్భంగా పలుసార్లు అక్కడ వాతావరణం వేడెక్కింది. స్వతహాగా ఆవేశపరుడైన నటుడు మోహన్ బాబు.. కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నటుడు బెనర్జీ, తనీష్ వంటి వాళ్లపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారని స్వయంగా వాళ్లే చెప్పారు.

  ఇక మిగతా వాళ్లు సైతం అక్కడ మోహన్ బాబు తమపై ఆవేశంలో ఊగిపోయారని అన్నారు. అయితే మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతి సమయంలోనూ అక్కడ మంచు మనోజ్ సంయమనంతో వ్యవహరించారని అంతా చెబుతున్నారు. అటు తన తండ్రిని మోహన్ బాబును సముదాయిస్తూనే.. ఇటు మిగతా నటులను కూడా సముదాయిస్తూ మంచు మనోజ్ మా ఎన్నికల సందర్భంగా మరింత రచ్చ జరగకుండా చూశారని పలువురు నటులు చెప్పిన దాన్ని బట్ట అర్థమవుతోంది.

  Drinking More Water: నీళ్లు మరీ ఎక్కువగా తాగుతున్నారా ?.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం..

  Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

  కొందరైతే.. ఆ రోజు అక్కడ మంచు మనోజ్ లేకపోయి ఉంటే మరింత గొడవ జరిగి ఉండేదని బాహాటంగానే కామెంట్ చేశారు. మొత్తానికి మా ఎన్నికల సందర్భంగా నటుడు మోహన్ బాబు పలుసార్లు ఆవేశానికి లోనవ్వగా.. ఆయన కుమారుడు మంచు మనోజ్.. అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించి పరిస్థితి చేయి దాటిపోకుండా వ్యవహరించాడని అర్థమవుతోంది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: MAA Elections, Manchu Manoj

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు