ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మంచు మనోజ్..లేటెస్ట్‌గా మనోజ్ తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వాడిన ‘ఫసక్’ అనే పదం సోషల్ మీడియాలో వైరల్ అవడం గురించి అభిమానులతో ట్విట్టర్‌లో సరదాగా చర్చించాడు.
ఈ సందర్భంగా ఒక నెటిజన్ మోహన్ బాబు చేసిన ‘ఫసక్’ కామెంట్‌పై ట్వీట్ చేస్తూ..‘అన్నా..బయట జనలు ‘ఫసక్’ అని ట్రోల్ చేసినా అది మీ మీద, మీ ఫ్యామిలీపై ఉన్న ప్రేమవల్లే. బాధపడకండి. అంతేకాదు మా అందరికీ మంచు కుటుంబం అంటే చాలా ఇష్టం అని ట్వీట్ చేశాడు. ఇందుకు మనోజ్ రిప్లై ఇస్తూ ..‘తిట్టినా‘..‘పొగిడినా’..ఆడుకున్నా..మీరే కదా బ్రదర్స్. మీరు పెట్టే కూడు తింటున్నాం. మాపై మీకు ఆ హక్కు ఎఫ్పుడు ఉంటుంది. ఎంజాయ్ అని పేర్కొన్నాడు.
Thittina Pogidina adukkuna meree kada brothers :) merru Pette kudu thintunam... u guys have every right :) aenjoy :) love u all regardless❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻😘😘😘 https://t.co/xlnVzDZ5Bn
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) September 4, 2018
ఈ సందర్భంగా మరో నెటిజన్ ‘మా’ అసోషియేషన్‌కు నిన్ను అధ్యక్షుడిగా చూడాలని ఉంది బ్రో అని ట్వీట్ చేశాడు. ఇందుకు మనోజ్..‘నేను వెళ్తే అపుడు అందరికీ ఫసకే...‘మా’ చాలా నిజాయితీగల సంస్థ. ‘మా’ లో అసోసియేషన్’పై తప్పుడు వార్తలను తోసిపుచ్చడానికి ఓ రివిజన్ కమిటీ పెడతున్నారు. ఇతరులు చేస్తున్న ఆరోపణలు తప్పని ‘మా’ నిరూపిస్తుందన్న నమ్మకం నాకుంది సమాధాన మిచ్చాడు.
A request from the son of CineAmma... pic.twitter.com/VyhL7RRfCx
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) September 4, 2018
మరో వివాదంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్స్
‘మా’లో చిచ్చు..శివాజీ రాజా వర్సెస్ నరేశ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Family, Telugu Cinema, Tollywood news