ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు, ఆయన కూతురు మంచు లక్ష్మి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వారిరువురూ కలిసి ఆ తిరుమల వేంకటేశ్వరుని సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అక్కా, తమ్ముళ్లిద్దరికీ.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆలయం వెలుపల మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. విష్ణు మాట్లాడుతూ.. తిరుపతిలో మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమా షూటింగ్ ప్రారంభం అయిందని తెలిపారు. ఇక తాను లీడ్ రోల్ లో చేస్తున్న మోసగాళ్ళు సినిమా త్వరలోనే విడుదల కానుందని విష్ణు చెప్పారు. మోసగాళ్ళు సినిమా విడుదల సందర్భంగా.. ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు పొందడానికి తిరుమల వచ్చామని ఆయన చెప్పారు.
Just finished Tirumala darshan. May all beings be happy and COVID free. Om Namo Vekateshaya. @ivishnumanchu pic.twitter.com/PsJ58W5BGw
— Lakshmi Manchu (@LakshmiManchu) October 30, 2020
తాను త్వరలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్నట్టు విష్ణు తెలిపారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఢీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అది ఓ రేంజీలో హిట్టయ్యింది. అప్పటిదాకా పడుతూ లేస్తూ వస్తున్న మంచు విష్ణు కెరీర్ కు ఆ సినిమా ఊపిరిలూదింది. డైరెక్టర్ శ్రీను వైట్ల కు కూడా ఆ సినిమా తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి. కానీ వరుస ప్లాప్ ల కారణంగా వీరిద్దరి కెరీర్ లు ప్రమాదంలో పడ్డాయి. కాగా, ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవుతుండటంతో ప్రేక్షకులు మరో ఢీ లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఇక మరోవైపు మంచు లక్ష్మీ చేతిలో కూడా పలు సినిమాలున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ఇప్పుడే దర్శనం ముగిసింది. కోవిడ్ నుంచి అందరినీ రక్షించమని నేను దేవుడిని కోరుకున్నాను అంటూ ట్వీట్ చేశారు. సినిమాలతో పాటు పలు టీవీ ఛానెళ్లలో షో లు కూడా నిర్వహిస్తున్న మంచు లక్ష్మీ.. త్వరలోనే మరో షో కు శ్రీకారం చుట్టనున్నట్టు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lakshmi manchu, Manchu Family, Mohan Babu, Tirumala news, Tirumala Temple