MANCHU LAKSHMI YOUTUBE CHANNEL HACKED HERE ARE THE DETAILS TA
Manchu Lakshmi: మంచు లక్ష్మికి అనుకోని షాక్ ఇచ్చిన హాకర్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
మంచు లక్ష్మి (manchu lakshmi)
Manchu Lakshmi: మంచు లక్ష్మి, తండ్రి మోహన్ బాబు నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు. తాజాగా ఈమెకు కొంత మంది సైబర్ నేరగాళ్లు ఈమె యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేసారు.
Manchu Lakshmi: మంచు లక్ష్మి, తండ్రి మోహన్ బాబు నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు. దర్శకేంద్రుని కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత నుండి అడపాదడపా సినిమాలు చేస్తోన్న లక్ష్మికి సరైన బ్రేక్ రాలేదు. అయితే లక్ష్మి ఇటూ సినిమాలు చేస్తూనే అటూ టీవీ స్క్రీన్ మీద ప్రోగ్రామ్స్ చేస్తూ తెలుగువారిని అలరిస్తోంది. తెలుగు తెరకు పరిచయం కాక ముందు లక్ష్మి, 'లాస్ వెగాస్', 'డెసపరేట్ హౌజ్ వైవ్స్' లాంటీ కొన్ని అమెరికన్ టెలివిజన్ షోస్‌లలో నటించింది. మంచు లక్ష్మి టాక్ షో కూడా చేసారు. ఇపుడు వెబ్ సిరీస్‌లో నటిస్తూ అలరిస్తోంది. ముఖ్యంగా సినిమాల కంటే కూడా స్మాల్ స్క్రీన్ పై తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది మంచు వారసురాలు. టాక్ షోస్, రియాలిటీ షోలతో లక్ష్మీకి ఫాలోయర్స్ బాగానే పెరిగిపోయారు. గతేడాది కూడా ఓ బోల్డ్ షోను హోస్ట్ చేసింది మంచు లక్ష్మి. స్టార్స్ అందరి బెడ్రూమ్ ముచ్చట్లు కూడా బయటికి తీసుకొచ్చింది.
The Chitti Chilakamma YouTube Account has been hacked. Kindly avoid any kind of misinterpreted content on the page.
My Team is looking into it and we are trying to get back the account as soon as possible.
ఈ మధ్యకాలంలో తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది మంచు లక్ష్మి. అంతేకాకుండా తను మాట్లాడే ఇంగ్లీష్ ఉచ్చారణ తో ప్రేక్షకులను తెగ ఆశ్చర్యపరుస్తుంది. ఇక సోషల్ మీడియాలో తను చేసే ట్వీట్లతో బాగా వైరల్ గా మారుతుంది. ఇదిలా ఉంటే మొన్నీమధ్య టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ట్వీట్ వేయగా అది వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు లక్ష్మి నిర్విహిస్తోన్న యూట్యూబ్ ఛానెల్‌ను ఎవరో ఆగంతక సైబర్ ముఠా హ్యాక్ చేసారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ స్వయంగా ట్వీట్ చేసారు. కొన్ని రోజుల క్రితం మంచు లక్ష్మి .. చిట్టి చిలకమ్మా అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసారు. ఇందులో తన కుమార్తె విద్యా నిర్వాణ ద్వారా పిల్లల పెంపకం, చదువు లాంటి విషయాలను బోధిస్తోంది. తాజాగా తన ఛానెల్‌ను ఎవరో హ్యాక్ చేసిన విషయాన్ని గుర్తించిన మంచు లక్ష్మి.. అందులో కొన్ని అర్ధరహితమైన పోస్టింగ్స్ వస్తున్నాయని.. త్వరలోనే మా టీమ్‌తో కలసి మా యూట్యూబ్ ఛానెల్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.