హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Lakshmi Rakul Preet Singh: రకుల్ ప్రీత్ కరోనా పాజిటివ్‌పై మంచు లక్ష్మి సెటైర్..

Manchu Lakshmi Rakul Preet Singh: రకుల్ ప్రీత్ కరోనా పాజిటివ్‌పై మంచు లక్ష్మి సెటైర్..

మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ (rakul manchu lakshmi)

మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ (rakul manchu lakshmi)

Manchu Lakshmi Rakul Preet Singh: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంటారు. కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ పాలునీళ్లలా కలిసిపోయారు. నీకునేను నాకునువ్వు అన్నట్లుంటారు. హైదరాబాద్ వస్తే మంచు లక్ష్మిని కలవకుండా..

ఇంకా చదవండి ...

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంటారు. కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ పాలునీళ్లలా కలిసిపోయారు. నీకునేను నాకునువ్వు అన్నట్లుంటారు. హైదరాబాద్ వస్తే మంచు లక్ష్మిని కలవకుండా.. ఆమెతో ఉండకుండా రకుల్ ఎక్కడికి పోదు. అంత క్లోజ్ అయిపోయారు ఇద్దరూ. అప్పుడప్పుడూ కలిసి బయటికి టూర్స్ కూడా ప్లాన్ చేస్తుంటారు. అప్పట్లో శ్రీలంక వెళ్లి రకుల్ బర్త్ డే సెలబ్రేట్ చేసింది లక్ష్మి. అప్పుడు బయటికి వచ్చిన ఫోటోలు సంచలనం రేపాయి కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అంతా షాక్ అవుతున్నారు. వరస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రకుల్.. ఉన్నట్లుండి కరోనా బారిన పడటంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని ట్విట్టర్‌లో అఫీషియల్‌గా ప్రకటించింది రకుల్. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది.. ఇప్పట్నుంచి క్వారంటైన్‌లో ఉంటాను అంటూ పోస్ట్ చేసింది రకుల్. దీనిపై చాలా సరదాగా మంచు లక్ష్మి స్పందించింది. నీకు పాజిటివ్.. నాకు నెగిటివ్ అంటూ రిప్లై ఇచ్చింది లక్ష్మి.


ఈ ఏడాది మోస్ట్ నెగిటివ్ పర్సన్ నేనే అంటూ తనపై తనే సెటైర్ వేసింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతుంది. మంచు లక్ష్మి, రకుల్ మధ్య ఎంత మంచి స్నేహితులు అనేది ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Manchu Lakshmi, Rakul Preet Singh, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు