అయోధ్య వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు కీలక తీర్పుఇచ్చింది. అయోధ్యలో వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఈ నేపథ్యంలో దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ కూడా దీనిపై ట్వీట్ ద్వారా తన స్పందన తెలియజేసింది.‘ మన దేశంలో శాంతి, గౌరవం మరింత వ్యాప్తిచెందాలి. భారతదేశాన్ని ఇతర దేశాల కంటే చాలా అందంగా తీర్చిదిద్దేది మన దేశ వైవిధ్యం మరియు సమగ్రత’ అంటూ ట్వీట్ చేసింది.
అయోధ్య కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ముస్లీంలకు ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలాన్ని కేటాయించాలంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్యలో ఐదెకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని పేర్కొంది. అంతకుముందు వివాదాస్పద భూమి తమదేనంటూ దాఖలైన షియా బోర్డు పిటిషన్ కొట్టివేశింది న్యాయస్థానం. మసీదును బాబర్ నిర్మించాడనేదానిని మేం సమర్థిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.