హోమ్ /వార్తలు /సినిమా /

మంచు లక్ష్మి కొత్త ఇన్నింగ్స్.. కూతురితో కలిసి రచ్చ

మంచు లక్ష్మి కొత్త ఇన్నింగ్స్.. కూతురితో కలిసి రచ్చ

మంచు ల‌క్ష్మి గొప్ప మ‌నసు.. వారి కోసం 100కి.మీలు సైక్లింగ్ చేయ‌బోతున్న న‌టి

మంచు ల‌క్ష్మి గొప్ప మ‌నసు.. వారి కోసం 100కి.మీలు సైక్లింగ్ చేయ‌బోతున్న న‌టి

మహేశ్ బాబు కుమార్తె సితార, దర్శకుడు వంశీపైడిపల్లి కుమార్తె ఆద్య తరహాలోనే మంచులక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ కూడా యూట్యూబ్‌లోకి అడుగుపెట్టింది.

  ఒకప్పుడు సినిమా స్టార్లు సినిమాలు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీని అందిపుచ్చుకొని కొత్త అవకాశాలను సృష్టించుకుంటున్నారు నేటి తారలు. వెండితెరతో పాటు బుల్లితెర, వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ రెండు చేతలా సంపాదిస్తున్నారు. ఇక ప్రస్తుత డిజిటల్ కాలంలో సిల్వర్ స్క్రీన్, టీవీ స్క్రీన్‌తో పాటు మొబైల్ స్క్రీన్‌లోనూ మెరుస్తున్నారు సిన స్టార్స్. వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ ఛానెళ్లలోనూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు సొంతంగా యూట్యూబ్ చానెల్‌ని నడుపుతున్నారు. తాజాగా ఆ లిస్టులో మంచు లక్ష్మి చేరిపోయారు.

  మహేశ్ బాబు కుమార్తె సితార, దర్శకుడు వంశీపైడిపల్లి కుమార్తె ఆద్య తరహాలోనే మంచులక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ కూడా యూట్యూబ్‌లోకి అడుగుపెట్టింది. తల్లి మంచు లక్ష్మితో కలికిస చిన్న పిల్లలకు స్పెషల్ క్లాస్‌లు చెబుతోంది. ఇద్దరు కలిసి పిల్లలు, వారి తల్లిదండ్రులకు చదువు, ఆటలు, ఇంటి పనులు సహా పలు అంశాల్లో సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు. చిట్టి చిలకమ్మ పేరుతో ఈ ఛానల్‌ని ప్రారంభించింది మంచు లక్ష్మి. స్పిల్ ఈజ్ వెల్ పేరుతో తొలి వీడియోను పోస్ట్ చేసింది. ఇంట్లో చిన్న పిల్లలు పడేసిన వస్తువులు, చల్లిన ఆహారపదార్థాలు.. తిరిగి వారితోనే ఎలా క్లీన్ చేయించాలో అందులో చూపించింది.

  మంచు లక్ష్మి చిట్టి చిలకమ్మ యూట్యూబ్ ఛానెల్:

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Manchu Lakshmi, Tollywood

  ఉత్తమ కథలు