దేశంలో ఎన్ని మహిళా చట్టాలు వచ్చినా ఎక్కడో చోట ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. రీసెంట్ గా సమాజాన్ని గాడిలో పెడుతూ ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్ అధికారి.. అర్థరాత్రి వేళ ఓ మహిళను లైంగికంగా వేధించడం చూసి జనం షాకయ్యారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని భోపాల్ లో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో దీనిపై మంచు లక్ష్మి (Manchu Lakshmi) సీరియస్ అయింది.
సినీ నటిగా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా, ఫ్యామిలీ అప్ డేట్స్ షేర్ చేయడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. తాజాగా మధ్యప్రదేశ్ లో అర్థరాత్రి వేళ ఓ మహిళపై పోలీస్ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడటం పట్ల ఆమె ఘాటుగా స్పందించింది. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ఈ దారుణాన్ని చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాత్రిపూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని అడ్డగించిన పోలీస్ అధికారి.. ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే అదృష్టవశాత్తూ ఆ అమ్మాయి ఎలాగోలా అతని చెర నుంచి తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ఆ వీడియో చూసి ప్రతి ఒక్కరూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆడవాళ్లకు, సమాజానికి రక్షణగా ఉండాల్సిన పోలీసే ఇలా ప్రవర్తించడం సిగ్గు చేటు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Blood boils https://t.co/StR428okW0
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 9, 2023
సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూనే పలు టీవీ షోస్ చేస్తూ సందడి చేస్తోంది మంచు లక్ష్మి. మోహన్ బాబు వారసురాలిగా కెమెరా ముందుకొచ్చిన ఆమె.. వ్యాఖ్యాతగా తన మార్క్ చూపిస్తోంది. రీసెంట్ గా తన తమ్ముడు మంచు మనోజ్ రెండో పెళ్లి బాధ్యతలు తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది మంచు లక్ష్మి. భూమా మౌనిక రెడ్డిని రెండో భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించారు మంచు మనోజ్. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Lakshmi, Tollywood, Tollywood actress