MANCHU LAKSHMI SAID NO TO TWO HISTORICAL ROLES OF TELUGU CINEMA AND THESE ARE THE DETAILS PK
మంచు లక్ష్మీ ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఎందుకు వదిలేసింది..?
కూతురుతో కలిసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది.. పోజులు కూడా బాగానే ఇస్తుంది మంచు లక్ష్మి. ఇప్పుడు కూడా ఇలాంటి ఫోటోషూట్ చేసింది.
మంచు లక్ష్మీ.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అటు సినిమాలు.. ఇటు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
మంచు లక్ష్మీ.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అటు సినిమాలు.. ఇటు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఇండస్ట్రీలో వారసురాళ్లు సక్సెస్ కాలేరు అనే సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ.. హీరోయిన్గా కాకపోయినా నటిగా మాత్రం మంచి పేరే తెచ్చుకుంది. దాంతో పాటు టెలివిజన్‌పై కూడా తనదైన ముద్ర వేసుకుంది మంచు వారమ్మాయి. సినిమాల్లోకి రాక ముందే బుల్లితెరపై తనేంటో నిరూపించుకుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే తెలుగులో రెండు చారిత్రాత్మక సినిమాల్లో నటించే అరుదైన అవకాశాన్ని మంచు లక్ష్మీ చేజార్చుకుంది.
మంచు లక్ష్మీ అరుంధతి సినిమా
ముందుగా ఆ రెండు పాత్రలు ఈమె దగ్గరికి వచ్చాయి. కానీ అనివార్య కారణాలతో ఆ రెండు సినిమాలు వదిలేసింది లక్ష్మీ. దాంతో అవి వేరే నటీమణులకు వెళ్లిపోయాయి. ఆ రెండు సినిమాలే అరుంధతి.. బాహుబలి. ముందుగా అనుష్క కెరీర్ మార్చేసిన అరుంధతి సినిమాలో మంచు లక్ష్మీనే అడిగారని తెలుస్తుంది. అప్పటికి ఇంకా ఇండస్ట్రీకి కూడా రాలేదు లక్ష్మీ. తొలి సినిమానే ఇలాంటి పాత్ర చేస్తే ఏమవుతుందో అనే భయంతో మంచు వారమ్మాయి ఈ పాత్రకు నో చెప్పిందని వార్తలొచ్చాయి.
మంచు లక్ష్మీ బాహుబలి శివగామి దేవీ
ఒకవేళ అనుష్క స్థానంలో మంచు లక్ష్మీ చేసుంటే మాత్రం ఎలా ఉండేదో..? ఇక బాహుబలిలో శివగామి పాత్రకు ముందు ఈమెను అడిగాడు రాజమౌళి. కానీ ఆ చిత్రంలో తాను నటిస్తాను కానీ ప్రభాస్‌కు తల్లిగా మాత్రం చేయనని చెప్పింది లక్ష్మీ. దాంతో ఆమె తర్వాత శ్రీదేవిని అడిగినా కూడా మిస్ అయింది.. ఆ తర్వాత రమ్యకృష్ణకు వచ్చింది.. ఆమె కెరీర్లోనే అది ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అయిపోయింది. ఇలా ఈ రెండు లెజెండరీ సినిమాల నుంచి తప్పుకుంది మంచు లక్ష్మీ. ఈ రెండింట్లోనూ ఆమె కనిపించి ఉంటే ఇప్పుడు ఆమె కెరీర్ ఎలా ఉండేదో అంటున్నారు అభిమానులు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.