కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను.. అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఈ భామకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అయితే తాజాగా మంచువారి అమ్మాయి ఓ కొత్త ఛాలెంచ్ విసిరింది. తన అభిమానులకు ఇలా చేసి చూపించాలంటూ సవాల్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ వీడియో, ఛాలెంజ్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.
‘సిట్ డౌన్’ చాలెంజ్ పేరుతో ఆమె ఓ వీడియోను క్రియేట్ చేసింది. ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వివిధ సందర్భాలు, వివిధ డ్రెస్సుల్లో ‘సిట్ డౌన్’ వీడియోలను చేసి... పోస్టు చేసింది. ఆమె.. సిట్ డౌన్ చాలెంజ్ అంటూ సోషల్ మీడియా యూజర్లకు సవాల్ విసిరింది. ఇలాంటి ట్రెండ్స్ ను ఫాలో అయ్యేందుకు అస్సలు ఆలస్యం చేయకూడదంటూ ఆమె ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈవీడియోను తెగ వైరల్ అవుతోంది.
సినిమా, పొలిటికల్ సెలబ్రిటీలు... పలురకాల ఛాలెంజ్‌లు చేస్తూ ఉంటారు. యంగ్ స్టార్స్ లో కొత్త కొత్త ఛాలెంజ్ లు మొదలుపెడుతున్నారు. ఫిట్ నెస్ ఛాలెంజ్‌లు,వర్కఔట్ ఛాలెంజెస్ చేస్తూ వస్తుంటారు. ప్రస్తుతం సెలబ్రిటీల్లో ఎటాక్ ఛాలెంజ్ నడుస్తుండగా.. ఇప్పుడు మంచు లక్ష్మీ మరో ఛాలెంజ్ ను స్టార్ట్ చేశారు. అదే సిట్ డౌన్ ఛాలెంజ్.ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మీ.. ఫన్నీ వీడియోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటారు. ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో కూడా ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డీజే టిల్లు మూవీలోని ఫేమస్ మాస్ సాంగ్ టిల్లు అన్నా డీజే పెడితే.. అంటూ సాగే పాటకి అదే లెవల్లో ఊరమాస్ స్టెప్పులేసింది. ఇందులో మంచు లక్ష్మీతో కలిసి హీరో సిద్దు, అమన్ చిందులేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
మరోవైపు మంచు లక్ష్మీ వీలు దొరికినప్పుడల్లా సినిమాలు కూడా చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఆమె పలు తెలుగు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి తండ్రి మోహన్ బాబుతో కలిసి నటిస్తోంది మంచు లక్ష్మీ. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకుడు. దర్శకురాలు నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇదొక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్’’ గా ఉంటుందని దర్శకుడు ప్రతీక్ ప్రజోష్ తెలిపారు. ఈ సినిమాలో మలయాళ నటుడు సిద్ధిఖ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ–మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.