MANCHU LAKSHMI HOT COMMENTS ON DRINKING MILK AT NIGHT TIME IN STAR MAA PARIVAAR AWARDS 2019 PK
మంచు లక్ష్మీకి రాత్రిపూట తాగే అలవాటు లేదంట.. కొంటె వ్యాఖ్యలు..
మంచు లక్ష్మి ఫైల్ ఫోటో
మంచు లక్ష్మీ.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అటు సినిమాలు.. ఇటు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
మంచు లక్ష్మీ.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అటు సినిమాలు.. ఇటు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఇండస్ట్రీలో వారసురాళ్లు సక్సెస్ కాలేరు అనే సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ.. హీరోయిన్గా కాకపోయినా నటిగా మాత్రం మంచి పేరే తెచ్చుకుంది. దాంతో పాటు టెలివిజన్‌పై కూడా తనదైన ముద్ర వేసుకుంది మంచు వారమ్మాయి. ఇక ఇప్పుడు ఈమె స్టార్ మా పరివార్ అవార్డుల వేడుకకు వచ్చింది. అక్కడికి వచ్చిన లక్ష్మీ.. స్టార్ మా కుటుంబానికి ధన్యవాదాలు తెలిపింది.
మంచు లక్ష్మి ఫైల్ ఫోటో
అంతేకాకుండా అక్కడ ఓ ఫన్నీ స్కిట్ చేసి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది ఈ ముద్దుగుమ్మ. అవార్డుల వేడుకలో సుమతో మంచు లక్ష్మీ చేసిన కామెడీ అందరి కడుపులు చెక్కలు చేసింది. ఇక స్టేజీపై అత్తా కోడళ్ల స్కిట్ చేసింది ఈమె. అందులో అత్తగా నటిస్తారా.. కోడలుగా నటిస్తారా అని సుమ అడిగిన వెంటనే మరో మాట ఆలోచించకుండా అత్తగా నటిస్తానని చెప్పింది లక్ష్మీ. ఇక స్కిట్ మొదలైన వెంటనే అక్కడే ఉన్న మరో నటిని ఏమే కోడలా.. ఏం చేస్తున్నావు.. వెంటనే నాకు కాఫీ తీసుకురా అంటూ అరిచేసింది లక్ష్మీ.
మంచు లక్ష్మిప్రసన్న
దానికి కోడలు పాత్రధారి కూడా కౌంటర్ వేస్తూ.. ఇప్పుడు కాఫీ తాగడం మంచిది కాదు అత్తా.. కావాలంటే పాలు తాగండి అంటుంది. దాంతో నాకే ఎదురు చెప్తావా అంటూ లక్ష్మీ సీరియస్ అవుతుంది. రాత్రి పూట పాలు తాగడం నాకు అలవాటు లేదని చెబుతుంది మంచు లక్ష్మీ. అసలు రాత్రిపూట పాలు తాగడం మా ఇంటా ఒంటా లేదంటూ ఝలక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దాంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా పగలబడి నవ్వేసారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.