హోమ్ /వార్తలు /సినిమా /

తరుణ్ భాస్కర్‌తో మంచు లక్ష్మీ... కొత్త వెబ్ సిరీస్..

తరుణ్ భాస్కర్‌తో మంచు లక్ష్మీ... కొత్త వెబ్ సిరీస్..

Instagram

Instagram

తరుణ్‌ భాస్కర్‌.. 'పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది.

  తరుణ్‌ భాస్కర్‌.. గతంలో షార్ట్ ఫిల్మ్స్ తీసినా.. 'పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. దీంతో తరుణ్ మొదటి చిత్రంతోనే అదిరిపోయే హిట్‌ అందుకున్నాడు. ఆ సినిమాకు ఆయనకు జాతీయ పురస్కారం కూడ లభించింది. ఆ తర్వాత ఈ నగరానికిఏమైంది సినిమా చేశాడు అది కూడా రొమాంటిక్ కామెడీ జానర్‌లో అదరగొట్టింది. ఆయన తాజాగా ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ హీరోగా పరిచయమైయాడు. అది అలా ఉంటే ఆయన ఓ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్ బాబు తనయ మంచు లక్ష్మీ ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. దీనికి సంబందించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్ జరుపుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతుందని సమాచారం. దీన్ని మంచు లక్ష్మీ స్వయంగా నిర్మిస్తోంది. ఆమె గతంలో 'నేను మీకు తెలుసా, ఝమ్మంది నాదం, ఊకొడతారా ఉలిక్కిపడతారా, దొంగాట,గుండెల్లో గోదావరి' అనే చిత్రాలు నిర్మించింది. ఈ వెబ్ సిరీస్‌తో పాటు తరుణ్ నెట్‌ఫ్లిక్స్ కోసం మరో వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదీ హిందీలో కియారా అద్వానీ, భూమీ పడ్నేకర్‌, రాధికా ఆప్టే‌లు ప్రధాన పాత్రలు పోషించిన లస్ట్ స్టోరీస్‌కు రీమేక్‌గా వస్తోంది.

  కేక పెట్టిస్తోన్న కంగనా రనౌత్ అందాలు...

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Manchu Lakshmi, Tarun bhaskar

  ఉత్తమ కథలు