హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Lakshmi: మంచు లక్ష్మి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..

Manchu Lakshmi: మంచు లక్ష్మి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..

మంచు లక్ష్మి (Instagram/Photo)

మంచు లక్ష్మి (Instagram/Photo)

Manchu Lakshmi | తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులే రాజ్య మేలుతున్న టైమ్‌లో నట ప్రపూర్ణ మోహన్ బాబు తనయగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను అప్పట్లో ఓ స్టార్ హీరోలను పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు తెలిపింది.

ఇంకా చదవండి ...

  Manchu Lakshmi | తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులే రాజ్య మేలుతున్న టైమ్‌లో నట ప్రపూర్ణ మోహన్ బాబు తనయగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. ముఖ్యంగా సినిమాల కంటే కూడా స్మాల్ స్క్రీన్ పై తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది మంచు వారసురాలు. టాక్ షోస్, రియాలిటీ షోలతో లక్ష్మీకి ఫాలోయర్స్ బాగానే పెరిగిపోయారు. గతేడాది కూడా ఓ బోల్డ్ షోను హోస్ట్ చేసింది మంచు లక్ష్మి. స్టార్స్ అందరి బెడ్రూమ్ ముచ్చట్లు కూడా బయటికి తీసుకొచ్చింది. ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అంటూ మంచు లక్ష్మి చేసిన ఈ షో బాగానే పాపులర్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తన పుట్టిన రోజు సందర్భంగా  మరో కొత్త షోకు శ్రీకారం చుట్టింది మంచు వారమ్మాయి. మొన్నటికి మొన్న లాక్‌డౌన్ సమయంలో కూడా 'లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు' పేరుతో ప‌లువురు సినీ, పొలిటిక‌ల్ సెల‌బ్రిటీల‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆమె ఇంట‌రాక్ట్ అయింది.

  ఆ సంగతి పక్కన పెడితే మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. తనకు సంబంధించిన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. అప్పట్లో ఈమె ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవాలనుకుందట. అతనికి మ్యారేజ్ కావడంతో వెక్కి వెక్కి ఏడ్చిందట. ఇంతకీ తన మ్యారేజ్‌తో మంచు వారి అమ్మాయి కళ్లలో నీళ్లు తెప్పించిన ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌ ఆమీర్ ఖాన్.

  అయితే... ఆమీర్ ఖాన్ మొదటిసారి పెళ్లి చేసుకున్నపుడే కాదు.. రెండోసారి మ్యారేజ్ చేసుకున్నపుడు కూడా మంచు లక్ష్మికి కన్నీళ్లు ఆగలేదట. అంతలా ఆమీర్ ఖాన్ పై క్రష్ ఉండేదట మంచు లక్ష్మికి. ఆమీర్ ఖాన్ తన సినిమాల విషయంలో ఎంతో ఆచితూచి చేస్తాడట. అందుకే అతనిపై ఇష్టం ఏర్పడిందని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. మరోవైపు తెలుగులో లక్ష్మికి తన ఎన్టీఆర్‌, తన తండ్రి మోహన్ బాబు, బాలకృష్ణ కాకుండా.. నాగార్జున అంటే ఎంతో ఇష్టమని చెప్పింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Aamir Khan, Manchu Lakshmi, Tollywood

  ఉత్తమ కథలు