అదేంటి వీర సింహారెడ్డి (Veera Simha Reddy) సినిమాకు మంచు లక్ష్మి (Manchu Lakshmi) ప్రమోషన్ చేయడమా? వింతగా ఉందే అనుకుంటున్నారా.. కాకపోతే ఇది నిజమే. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వీర సింహారెడ్డి సినిమాకు తన వంతు ప్రమోషన్ అందిస్తోంది మంచు వారమ్మాయి. మంచు లక్ష్మికి సోషల్ మీడియాలో యమ ఫాలోయింగ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ (Nandamuri Balakrishna) వీర సింహారెడ్డి పాటకు స్టెప్పేసి ఆ వీడియోను తన ఇన్స్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసి వైరల్ చేసింది మంచు లక్ష్మి.
వీర సింహారెడ్డి మూవీలో మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది మంచు లక్ష్మి. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేస్తూ.. వీరసింహారెడ్డి మూవీ చూడటం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా అని ట్యాగ్ లైన్ రాసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. బాలయ్య బాబు హుషారెత్తే పాటకు మంచు లక్ష్మి స్టెప్పులు చూసి ఫిదా అవుతోంది నందమూరి అభిమాన వర్గం.
మోహన్ బాబు కూతురుగా, సినీ నటిగా టాలీవుడ్ లో మంచు లక్ష్మికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వెండితెర, బుల్లితెరపై మెరుస్తూనే సోషల్ మీడియాలో కూడా హంగామా చేస్తుంటుంది ఈ సినీ తార. నందమూరి ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా బాలకృష్ణతో మంచు లక్ష్మికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఉ కొడతారా? ఉలిక్కి పడతారా..? సినిమాలో బాలయ్య బాబుతో కలిసి నటించింది మంచు లక్ష్మి.
View this post on Instagram
ఇకపోతే జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. విడుదలకు ముందు వదిలిన అప్ డేట్స్ ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేయడంతో బాలయ్య బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. దేశ విదేశాల్లో సిల్వర్ స్క్రీన్‌పై బాలకృష్ణ పౌరుషం చూసి పూనకాలెత్తిపోతున్నారు ఆడియన్స్. విడుదలైన తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ బాలకృష్ణ మేనరిజం, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షక లోకాన్ని మెస్మరైజ్ చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.