హోమ్ /వార్తలు /సినిమా /

చిరంజీవి, మోహన్ బాబుల గొడవపై మంచు లక్ష్మి అదిరిపోయే కామెంట్స్...

చిరంజీవి, మోహన్ బాబుల గొడవపై మంచు లక్ష్మి అదిరిపోయే కామెంట్స్...

Twitter

Twitter

నటుడు చిరంజీవి, మోహన్‌బాబుకి మధ్య గొడవలపై నటి, టీవీ ప్రసెంటర్ మంచులక్ష్మి తన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

  నటుడు చిరంజీవి, మోహన్‌బాబుకి మధ్య గొడవలపై నటి, టీవీ ప్రసెంటర్ మంచులక్ష్మి తన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా లక్ష్మి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అంతేకాదు ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ సందర్భంగా లక్ష్మి మెగాస్టార్ చిరంజీవి, తన తండ్రి మెహన్ బాబుపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాటల్లో..‘ఈ ఏడాదిలోని మొదటి నెల నేటితో పూర్తి కావొచ్చింది. కొత్త దశాబ్దం.. కొత్త ఏడాది.. నాన్న, చిరంజీవి అంకుల్‌ ఆలింగనం చేసుకున్న ఫొటోలతో చాలా ఎంతో గొప్పగా ప్రారంభమైంది. ఆ పిక్స్ ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి. అయితే అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆ ఇద్దరూ అలా కలిసి ఒకరికొకరు హత్తుకుని దిగిన ఆ ఫొటోలు చూడగానే నాకెంతో సంతోషం అనిపించింది. అయితే ఎప్పటినుండో వీరిద్దరి మధ్య గొడవలున్నాయంటూ చాలామంది అనుకుంటున్న సమయంలో ఇలా కుదరడం బాగుంది. మా చిన్నతనంలో వాళ్లు మా ఇంటికి, మేము వాళ్లింటికి వెళ్తుండేవాళ్లం. నాన్న, చిరు అంకుల్‌ ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించడం.. అందులో భాగంగా ఆ షూటింగ్‌ ఎక్కువగా ఊటీలో చిత్రీకరించడం వల్ల మా రెండు కుటుంబాలు సమ్మర్ హాలీడేస్‌ను అక్కడే ఎంజాయ్‌ చేసేవాళ్లం.

  చిరంజీవి, మోహన్ బాబు Photo : Twitter

  అయితే కొంతమంది అన్నట్లు ఒకవేళ వాళ్ల మధ్య తగాదాలు, గొడవలు ఉండి ఉంటే కలిసి అన్ని సినిమాల్లో నటించేవాళ్లు కాదు. వారి మధ్య నాకు తెలిసి కేవలం ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేది. ఇక్కడ మరో విషయం ఏమంటే అభిమానులు కూడా ప్రతి ఒక్కరినీ ఆదరించండి.. అంతేకానీ గొడవలు పడకండి.. ఒకే సారి చిరంజీవిని ఇష్టపడొచ్చు.. అదే సమయంలో మోహన్ బాబును అభిమానించొచ్చు అని పేర్కోంది.

  View this post on Instagram

  The first month of this year has come to an end already and This New Year, This New Decade had an amazing start, I mean I just came back from my holiday for new years and the internet was blown up with the pictures of Chiranjeevi Uncle and daddy hugging each other. I didn't even know what the context was, but I was like Oh my god this is so great, I think it is beautiful for the new year to start with so much love because every time they are seen together, there is an unnecessary rivalry created. I mean we call each other at least the kids we call each other once a week and growing up we spent a lot of holidays together because our summer holidays were shot in Mudumalai National park or Ooty or somewhere where my dad and he have done so many films together. It is impossible to be together in so many films when you hate each other so much. What there is, is a competition and I think that competition should be there among any healthy individuals who want to strive to be better. And that is what those two had. We come from this mentality of taking sides and wanting to fight each other because you are on one side. I believe you can be Pawan Kalyan's fan and Mahesh Babu's fan , You can be Mohan Babu's fan and Chiranjeevi's fan, You can be Lakshmi Manchu's fan and Samantha's fan. Here we are in the new decade and I am really glad that this really set the precedent for everybody because they are legends and they are icons and they are the pillars of Telugu cinema industry and I believe that the fans can fall in love with more than one actor and let love prevail for everybody and not fighting.


  A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Chirajeevi, Lakshmi manchu, Mohan Babu

  ఉత్తమ కథలు