Home /News /movies /

MANCHU LAKSHMI COMMENTS ON ALLU ARJUN ACTING IN PUSHPA A TWEET GOES VIRAL SR

Allu Arjun | Manchu Lakshmi: అల్లు అర్జున్ యాక్టింగ్‌పై మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్..

Manchu Lakshmi Photo : Twitter

Manchu Lakshmi Photo : Twitter

Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా జనవరి 7 నుంచి తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

  Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా జనవరి 7 నుంచి తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్‌లో ఈ సినిమాను చూడని సినీ ప్రేక్షకులు ఈ సినిమాను ప్రైమ్’లో చూస్తూ తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు సినీ సెలెబ్రిటీస్ ఈ సినిమా పట్ల తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమాపై మంచు లక్ష్మి స్పందించారు. పుష్ప సినిమా అదిరిపోయిందని, అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉందంటూ హ్యాట్సాఫ్ చెప్పుకొచ్చారు లక్ష్మి. పుష్పరాజ్ లాంటి పాత్రను చేయడానికి చాలా కష్టం, స్టార్ హీరో ఇలాంటీ పాత్ర చేసి మెప్పించడం బాగుందన్నారు మంచు లక్ష్మి. అంతేకాదు ఈ సినిమాలో సమంత డాన్స్‌తో, రష్మిక తన నటనతో కేక పెట్టించారని.. దేవిశ్రీప్రసాద్ కూడా అదిరే మ్యూజిక్‌తో మైండ్ బ్లాంక్ చేశారంటూ పుష్ప టీమ్‌ను మెచ్చుకున్నారు. పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు మంచు లక్ష్మి. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ థాంక్స్ చెప్పారు. దీనికి సంబంధించిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  ఇక ఇదే సినిమాను మెచ్చుకుంటూ తమిళ క్రియేటివ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ట్విట్టర్‌లో కామెంట్ చేస్తూ అల్లు అర్జున్ యాక్టింగ్‌ గురించి కామెంట్ చేశారు. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ అదిరే లెవెల్లోకి ఉందని.. పాత్రకు తగినట్లుగా అల్లు అర్జున్ తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చడం బాగుందని, తన నటనతో పిచ్చెక్కించారని, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందని తెలిపారు దర్శకుడు సెల్వ రాఘవన్. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను సుకుమార్ ప్రెజెంట్ చేసిన విధానం కేక అంటూ మెచ్చుకున్నారు.


  ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. కొన్ని చోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఇప్పటికి అక్కడ పుష్ప సినిమాకు 2 నుంచి 3 కోట్ల వసూళ్లకు తగ్గకుండా వస్తుండడం అనేది మరో గొప్ప విషయం అంటున్నారు. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి స్పష్టం అయ్యిందని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. పుష్ప ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు బిహార్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా 72.49 కోట్లవరకు వసూలు చేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.


  పుష్ప సినిమా అన్ని భాషాల్లో కలిపి 300 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను వదిలింది టీమ్. అది అలా ఉంటే ఈ సినిమా తాజాగా మరొక రికార్డు క్రికెట్ చేయడం జరిగింది. హిందీలో రాకింగ్ స్టార్ నటించిన కేజీయఫ్ చిత్రం లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్ళను అల్లు అర్జున్ పుష్ప కేవలం 13 రోజుల్లో సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల వసూళ్లతో అక్కడ అదరగొట్టింది. పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు.

  ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా ఒక హిందీలో తప్ప మిగితా అన్ని భాషాల్లో జనవరి నుంచి అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. దీంతో థియేటర్‌లో చూడని వారు అమెజాన్ ప్రైమ్‌లో ఈ శుక్రవారం చూడోచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్‌తో పాటు నాన్ థియేట్రికల్ హక్కులు, ఓటిటి హక్కులు కలిపి దాదాపు 250 కోట్ల‌కు బిజినెస్‌ జరిగిందని తెలుస్తోంది.

  Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కు కరోనా..

  ఇక ఈ సినిమాలో మిగితా పాటలతో పాటు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావాకు అదిరే రెస్పాన్స్‌ను వస్తోంది. ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. పుష్పను తమిళ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేశారు. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ, మంగలం శ్రీనుగా సునీల్‌ అదరగొట్టారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించగా.. శ్రీవల్లి పాత్రలో ఆమె మైమరిపించారు. పుష్ప లో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలు చేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Allu Arjun, Manchu Lakshmi, Pushpa Movie, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు