హోమ్ /వార్తలు /సినిమా /

మంచు లక్ష్మీ డాన్స్.. ఆచార్య సినిమా పోయిందనే కదా! ఆడుకుంటున్న నెటిజన్స్

మంచు లక్ష్మీ డాన్స్.. ఆచార్య సినిమా పోయిందనే కదా! ఆడుకుంటున్న నెటిజన్స్

కూతురితో కలిసి మంచు లక్ష్మీ డాన్స్

కూతురితో కలిసి మంచు లక్ష్మీ డాన్స్

కూతురితో కలిసి మంచు లక్ష్మీ వేసిన డాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇద్దరు నైట్ డ్రెస్సుల్లో బుల్లెట్ సాంగ్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు.

మంచు లక్ష్మీ.. సోషల్ మీడియాలో చాలా ఉత్సాహంగా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలతో పాటు.. అనేక రకాల అంశాలను ఆమె తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మంచు లక్ష్మీకి ఓ కూతరు కూడా ఉన్న విషయం తెలిసింది. ఆరేళ్ల కూతురు విద్యా నిర్వాణకు సంబంధించిన విషయాలు కూడా లక్ష్మీ తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేస్తూ ఉంటుంది. తాజాగా కూతురుతో కలిసి డాన్స్ చేసిన వీడియోను  ఆమె తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసింది. ఈ వీడియోలో బుల్లెట్ బండి పాటకు తల్లికూతరు కలిసి వేసిన స్టెప్స్‌ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా మేం కాస్త ఫన్ చేశాం అంటూ.. తన వీడియోకు కామెంట్ కూడా పెట్టింది మంచు లక్ష్మీ.

నైట్ డ్రెస్సులో బుల్లెట్ బండికి మంచు లక్ష్మీ వేసి స్టెప్పులు అందర్నీ ఆకట్టుకున్నాయి. నెటిజన్స్ చాలామంది డాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ పెట్టారు. కొందరు అయితే  మంచు లక్ష్మీకి ఇంత డాన్స్ వస్తుందని అనుకోలేదని అన్నారు.ఇక కూతురు జూనియర్ లక్ష్మీ కూడా బాగానే డాన్స్ వేసిందని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.మరికొందరు అయితే నెగెటివ్ కామెంట్లు కూడా పెట్టారు. నువ్వు ఎంత ఊపిన సినిమా అవకాశాలు రావంటూ... ఓ నెటిజన్ నెగెటివ్‌గా కామెంట్ చేశారు. మరో నెటిజన్.. ‘నిజం చెప్పు.. ఆచార్య సినిమా పోయిందనే కదా డాన్స్ వేసుకుంటున్నారు ఫ్యామిలీ మొత్తం’ అంటూ పోస్టు చేశారు. దీంతో ఇప్పుడు మంచు లక్ష్మీ డాన్స్‌తో పాటు.. నెటిజన్స్ పెట్టిన కామెంట్లు సైతం వైరల్ అవుతున్నాయి.


మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్‌కు మధ్య వార్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా మంచు ఫ్యామిలీని మెగా అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల మంచు విష్ణు చేసిన ట్వీట్ పై కూడా మెగా ఫ్యాన్స్ స్పందించిన విషయం తెలిసిందే.  ఆచార్య సినిమా విడుదలైన రోజే.. ఉదయం 5 గంటలకే మంచు విష్ణు ఓ ట్వీట్ చేశాడు. 'డాన్స్ రిహార్సల్స్ మొదలయ్యాయి. దీనితో నా ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి' అంటూ విష్ణు ట్వీట్ చేశాడు. దీనితో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఆరోజే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంచు విష్ణు ట్వీట్ చేసే సమయానికి యూఎస్ ప్రీమియర్స్ నుంచి ఆచార్య చిత్రానికి టాక్ మొదలైపోయింది.  టాక్ ఆశించిన విధంగా లేదు. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అదే టైంకి విష్ణు ఇలా ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆచార్యతో ముడిపెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఆచార్య చిత్రాన్ని ట్రోల్ చేయడానికే పొద్దునే ఈ ట్వీట్ చేశాడు అని అంటున్నారు. ఇక ఇప్పుడు మంచు లక్ష్మీ కూడా డాన్స్ వీడియో షేర్ చేయడంతో.. కొందరు మెగా అభిమానులు ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: Manchu Family, Manchu Lakshmi

ఉత్తమ కథలు