హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Lakshmi: అతనితో మంచు లక్ష్మీకి అంత క్లోజ్ రిలేషన్ ఏంటీ .. హగ్ చేసుకున్న ఫోటోపై బీభత్సమైన ట్రోలింగ్

Manchu Lakshmi: అతనితో మంచు లక్ష్మీకి అంత క్లోజ్ రిలేషన్ ఏంటీ .. హగ్ చేసుకున్న ఫోటోపై బీభత్సమైన ట్రోలింగ్

laxmi manhu(Photo:Instagram)

laxmi manhu(Photo:Instagram)

Manchu Lakshmi: కలెక్షన్‌ కింగ్ మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీ క్యాజువల్‌గా దిగిన ఫోటో వైరల్ అవుతోంది. ఆమె ఓ యువకుడ్ని హగ్ చేసుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోపై నెటిజన్లు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కలెక్షన్‌ కింగ్ మోహన్‌బాబు(Manchu Mohan Babu) కుమార్తె మంచు లక్ష్మీ(Manchu Lakshmi)క్యాజువల్‌గా దిగిన ఫోటో కూడా వైరల్(Viral)అవుతోంది. ఆమె పక్కన మరో వ్యక్తిని హగ్ చేసుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోపై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. సాధారణంగా మంచు లక్ష్మీ మాట్లాడే విధానం, ఇంగ్లీష్‌ భాషపై కామెంట్స్‌, మీమ్స్ షేర్ చేసే సోషల్ మీడియా(Social media) ఫాలోవర్స్ ఈసారి ఇంకో అడుగు ముందుకేసి మంచు లక్ష్మీని టార్గెట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో చక్కర్లు కొడుతున్న మంచు లక్ష్మీ ఓ యూట్యూబ్ యాంకర్ నిఖిల్ విజేంద్రసింహా(Nikhil Vijendrasimha)కు హగ్ ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పడంతో రచ్చ మొదలైంది.

Ariyana Glory : సోషల్ మీడియాలో అరియానా గ్లోరీ హల్‌చల్‌ మళ్లీ స్టార్ట్ .. ఏ రేంజ్‌లో ఉందంటే

మంచు లక్ష్మీ హగ్ ఇచ్చిన వ్యక్తి ఎవరూ..

నటి, టీవీ షో యాంకర్, నిర్మాత మంచు లక్ష్మీ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. యాక్ట్ చేసింది పట్టుమని పది సినిమాలు కూడా ఉండవు కాని ఆమె క్రేజ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు మంచు లక్ష్మీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఓ యూట్యూబ్ చానల్‌ యాంకర్‌ నిఖిల్ విజేంద్రసింహా బర్త్ డే సందర్బంగా ఆమె విషెస్ చెప్పిన తీరు ..అతనితో ఫోటో దిగిన స్టైల్‌పై నెటిజన్లు డిఫరెంట్‌గా స్పందించారు. కొందరు మంచు లక్ష్మీతో పాటు యాంకర్ నిఖిల్ విజేంద్రసింహాను ట్రోల్ చేస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని మరీ విషెస్ చెప్పుకోవడం చూసి ఇంకెందుకు మాటల్లో చెప్పలేనంత వల్గర్‌గా కామెంట్స్ చేశారు. ఆ పోస్టే ఇప్పుడునెట్టింట వైరల్ అవుతోంది.  ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు హల్ చల్ అవుతోంది.

బర్త్‌ డే విషెస్‌పై ట్రోలింగ్ ..

బర్త్‌ డే విషెస్ చెప్పాలంటే ఇంత క్లోజ్‌గా హగ్ చేసుకోవాలా అని కొందరు..ఇంకెందుకు మీ ఇద్దరి జోడి బాగుంది ..ఇద్దరూ పెళ్లి చేసుకోండి కోతికి చిక్కిన కొబ్బరి చిప్పలా ఉందంటూ బీభత్సంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో షేర్ చేసి నాలుగైదు రోజులు అవుతున్నా ..ఇద్దరి స్టిల్స్‌పై అభ్యంతరకరమైన పోస్ట్‌లు మాత్రం ఆగడం లేదు. అయితే ఇలాంటి వాటిని మంచు లక్ష్మీ పెద్దగా కేర్ చేయదని తెలిసి కూడా ట్రోలింగ్‌ మాత్రం ఆపడం లేదు నెటిజన్లు.

Sreemukhi : గ్లామర్ డోస్ విషయంలో తగ్గేదేలే అంటున్న శ్రీముఖి.. అందాల ఆరబోతలో రాములమ్మ రచ్చ..

మంచువారి అమ్మాయిపై సెటైర్లు..

మోహన్‌బాబు కుమార్తెగానే కాకుండా మంచు లక్ష్మీ.. తమిళ ,తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది. అనగనగా ఓ ధీరుడు సినిమాలో చేసిన పాత్రకు గాను.,, మంచు లక్ష్మీకు 2012న నంది అవార్డు అందుకుంది. దొంగాట సినిమాలో ఏందిరో అనే పాటకు గాను ఆమెకు  గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డుని సొంతం చేసుకుంది. ఇక ఉత్తమ సహాయ నటిగా  తెలుగు ఫిలింఫేర్ అవార్డ్ కూడా గెలుచుకుంది మంచు లక్ష్మీ. ఇప్పుడు వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది.

First published:

Tags: Manchu Lakshmi, Tollywood actress, Viral photo

ఉత్తమ కథలు