హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Lakshmi Birthday Special: మంచు లక్ష్మీ కొత్త షో.. 'క‌మింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ ల‌క్ష్మీ మంచు'..

Manchu Lakshmi Birthday Special: మంచు లక్ష్మీ కొత్త షో.. 'క‌మింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ ల‌క్ష్మీ మంచు'..

మంచు లక్ష్మీ న్యూ షో (manchu lakshmi new show)

మంచు లక్ష్మీ న్యూ షో (manchu lakshmi new show)

Manchu Lakshmi Birthday: ఎప్పుడూ ఏదో ఓ విధంగా వార్తల్లోనే ఉంటుంది మంచు ల‌క్ష్మీ. ముఖ్యంగా సినిమాల కంటే కూడా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది మంచు వారసురాలు. టాక్ షోస్, రియాలిటీ షోలతో లక్ష్మీకి ఫాలోయర్స్ బాగానే పెరిగిపోయారు.

ఇంకా చదవండి ...

ఎప్పుడూ ఏదో ఓ విధంగా వార్తల్లోనే ఉంటుంది మంచు ల‌క్ష్మీ. ముఖ్యంగా సినిమాల కంటే కూడా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది మంచు వారసురాలు. టాక్ షోస్, రియాలిటీ షోలతో లక్ష్మీకి ఫాలోయర్స్ బాగానే పెరిగిపోయారు. గతేడాది కూడా ఓ బోల్డ్ షోను హోస్ట్ చేసింది మంచు లక్ష్మి. స్టార్స్ అందరి బెడ్రూమ్ ముచ్చట్లు కూడా బయటికి తీసుకొచ్చింది. ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అంటూ మంచు లక్ష్మి చేసిన ఈ షో బాగానే పాపులర్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తన పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 8న మరో కొత్త షోకు శ్రీకారం చుట్టింది మంచు వారమ్మాయి. మొన్నటికి మొన్న లాక్‌డౌన్ సమయంలో కూడా 'లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు' పేరుతో ప‌లువురు సినీ, పొలిటిక‌ల్ సెల‌బ్రిటీల‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆమె ఇంట‌రాక్ట్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక ప్రోమోతో త‌న కొత్త షోను అనౌన్స్ చేసింది.

సౌత్ బే స‌మ‌ర్పిస్తోన్న‌ ఆ షో పేరు 'క‌మింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ ల‌క్ష్మీ మంచు'. ఇది కూడా లాక్‌డౌన్ సమయంలో వచ్చిన 'లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు' త‌ర‌హాలోనే ఉండబోతుంది. ఈ షోలో ఆమె ఫిలిమ్స్‌, స్పోర్ట్స్‌, ఫ్యాష‌న్‌, ఫుడ్‌.. త‌దిత‌ర రంగాల‌కు చెందిన సెల‌బ్రిటీల‌ను ఆమె ఇంట‌ర్వ్యూ చేయబోతుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజ‌మౌళితో పాటు మంచు లక్ష్మీ ఫ్రెండ్ తాప్సీ ప‌న్ను.. సెందిల్ రామ‌మూర్తి, సానియా మీర్జా, ప్ర‌కాష్ అమృత‌రాజ్‌, శంత‌ను, నిఖిల్‌, బిభు మొహాపాత్ర‌, పూజా ధింగ్రా, అన్నా పొలీవియౌ త‌దిత‌రులు కనిపిస్తున్నారు. సౌత్ బే ప్రెజెంట్ చేస్తున్న 'క‌మింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ ల‌క్ష్మీ మంచు' షో త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Manchu Lakshmi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు