Manchu Vishnu : గత కొన్నేళ్లుగా మోహన్ బాబుకు చెందిన మంచు కుటుంబంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దీంతో మీడియాతో పాటు సోషల్ మీడియాలో వీరి గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. అవును ఇటీవల మంచు మోహన్ బాబు వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లు గొడవ పడినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. చాలా విషయాల్లో వీరి మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా బోలెడన్ని వార్తలు షికారు చేసాయి. లోలోపల చాలా గొడవలు జరుగుతున్నాయనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఎట్టకేలకు మంచు బ్రదర్స్ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడటంతో మోహన్ బాబుకు కూడా అప్‌సెట్ అయినట్టు సమాచారం. ఈ వయసులో కుమారులు రచ్చ కెక్కడం ఆయనకు ఎంతో కుమిలిపోయినట్టు తెలుస్తోంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత క్రమశిక్షణ అంటే ఖచ్చితంగా మోహన్ బాబు పేరే చెబుతారు. ఆయనతో సినిమా అంటేనే నటీనటులకు ఒకలాంటి బెరుకు. షూటింగ్‌కు చెప్పిన సమయానికి రాకపోతే.. ఆయా నటీనటులు విషయంలో ఈయన చండశాసనుడే పేరు ఉంది.
స్వయంగా మనోజ్ ఆ వీడియోలో.. బంధువుల ఇళ్లలోకి వచ్చి మావాళ్లను, బంధువులను కొడుతుంటారండీ, ఇది సిట్యూయేషన్ అంటూ మాట్లాడారు. ఇక అప్పటి నుంచి రకరకాల రూమర్స్ మంచు ఫ్యామిలీపై వస్తున్నాయి. ఇక మంచు కుటుంబానికి ఎప్పటి నుంచో పనిచేస్తోన్న సారథి ఇంట్లో చొరబడి ఆయనపై విష్ణు చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఆ వీడియోను మంచు మనోజ్ డీలీట్ చేసినా.. అప్పటికే చాలా మంది ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మరోవైపు ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో అన్నదమ్ములని కలిపే ప్రయత్నాలు జరుగుతూన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్, విష్ణు గురించి మాట్లాడట్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ గొడవపై అటు విష్ణు, ఇటు మోహన్ బాబు కూడా స్పందించారు. ప్రతి ఇంట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని... అన్నదమ్ములు చిన్న చిన్న గొడవలు మాములే అని మోహన్ బాబు అని అన్నారు.
Akshay - Alia - Katrina: అక్షయ్ కుమార్ టూ ఆలియా వయా కత్రినా వీళ్లంత భారతీయులు కారన్న సంగతి తెలుసా..
ఆ తర్వాత మంచు మనోజ్.. కొత్తగా పెళ్లైన తనను ఆశీర్వదించాలని కోరారు. ఆపై ఎవరికి భయపడనంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా మంచు విష్ణు మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అందులో ఓ రియాలిటీ షోను సంబంధించిన కంటెంట్‌కు దీనికి ‘హౌస్ ఆఫ్ మంచూస్’ అని పేరు పెట్టాడు. త్వరలో దీన్ని ప్రముఖ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నట్టు చెప్పారు. బిగ్‌బాస్ తరహాలోనే మంచు ఫ్యామిలీలో జరిగే విషయాలు ఇందులో చూపించబోతున్నట్టు చెప్పారు. మొత్తంగా ఇదంత రియాలిటీ షోలో భాగంగా చేసిందనే విషయాన్ని మంచు విష్ణు చెప్పారు.
???????????????? ???????? ???????????????? ???????????? ????????????????????????????????????!❤️https://t.co/xVJsrrpLIK#HOM #HouseOfManchus
— Vishnu Manchu (@iVishnuManchu) March 30, 2023
కానీ నెటిజన్స్ మాత్రం.. జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా డ్రామా అంటూ మండిపడుతున్నారు. ఇకనైనా నెటిజన్స్‌తో సిల్లీగా ప్రవర్తించవద్దంటూ దుయ్యబడుతున్నారు. మాములుగా అందరు ఏప్రిల్ ఫూల్ చేస్తుంటారు. కానీ మంచు ఫ్యామిలీ మాత్రం ఏప్రిల్ రాకముందే ప్రజలను ఈ రకంగా ఫూల్స్ చేస్తారా అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనా అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్టు ఉంది మంచు విష్ణు ఫ్యామిలీ మ్యాటర్స్. ఏది ఏమైనా లోగుట్టు పెరుమాళ్లకే తెలియాలంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Lakshmi, Manchu Manoj, Manchu Vishnu, Tollywood