మనసు మమత సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్లో నివసిస్తున్న శ్రావణి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఈ ఆత్మహత్యకు కారణం ప్రేమ పేరుతో సాగిన లైంగిక వేధింపులని సమాచారం అందుతోంది. శ్రావణికి టిక్ టాక్ ద్వారా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అయితే గత కొంతకాలంగా శ్రావణిని దేవరాజ్ రెడ్డి వేధింపులకు గురి చేశాడని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలోకి వెళ్లిన శ్రావణి ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా శ్రావణి చనిపోయి ఉంది. అది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను యశోద హాస్పిటల్‌కు తరలించారు. శ్రావణిని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని తేల్చారు. శ్రావణి ఆత్మహత్యకు దేవరాజు రెడ్డి వేధింపులే కారణం అని కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ.. శ్రావణి మృతికి కారణమైన దేవరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
శ్రావణి గత ఎనిమిది సంవత్సరాల నుండి తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. అందులో ముఖ్యంగా మౌనరాగం, మనసు మమత లాంటీ పాపులర్ సీరియల్స్‌లో నటించి మంచి పేరుతెచ్చుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood Movie News