Home /News /movies /

MANASARA RADHAKRISHNAN GETS OFFERS FROM TELUGU FILM INDUSTRY SR

లక్కంటే ఈ భామదే.. ఓ రూమర్‌తో ఆ హీరోయిన్‌ ఫేట్ మారుతోందిగా..

మానస రాధాకృష్ణన్ Photo : Twitter

మానస రాధాకృష్ణన్ Photo : Twitter

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

    గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుటికే స్క్రిప్టు పనులు దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత షూటింగ్‌కు వెళ్లే ఆస్కారం ఉంది. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో విరూపాక్షలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తైతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో హరీష్ ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులతో బిజీగా వున్నాడు. ఇక సినిమాలో పవన్ సరసన మలయాళీ భామ మానస రాధాకృష్ణన్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. మానస మలయాళ చిత్రపరిశ్రమకి బాలనటిగా పరిచయమై.. ఆ తర్వాత హీరోయిన్‌గా అక్కడ ఓ పది సినిమాల వరకూ చేసింది. ఈ అమ్మాయి పవన్ సరసన నటించనుందని సోషల్ మీడియా కోడై కూసింది. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశాడు. ఇంతలోపే అసలు ఈ మానస ఎవరు అంటూ పవన్ అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన సినీ దర్శక నిర్మాతలు ఆ అమ్మాయిని గురించి గూగుల్‌‌లో సెర్చ్ చేయడంతో పాటు ఆమె సినిమాల వివరాలను తెలుసుకున్నారు. అంతేకాదు యువ హీరోల సరసన ఈ భామ అయితే బాగుంటదని తాము నిర్మించే సినిమాల్లో హీరోయిన్‌గా పరిచయం చేయడానికి తెగ ఉత్సాహాన్ని చూపుతున్నారట. అందులో భాగంగా ఆ అమ్మాయిని సంప్రదించడం లాంటీవి కూడా మొదలైయ్యాయని టాక్. అలా ఈ అమ్మాయికి వరుస అవకాశాలు వెళుతున్నాయని అంటున్నారు. అలా ఓ రూమర్ ఈ అమ్మాయికి అవకాశాలను తెచ్చిపెడుతోంది అన్నమాట. చూడాలి మరి ఈ భామ ఏ యువ హీరో సరసన మెరవనుందో.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Harish Shankar, Pawan kalyan, Tollywoood

    తదుపరి వార్తలు