MANASANAMAHA MUCH ACCLAIMED SHORT FILM MANASANAMAHA ENTERS GUINNESS BOOK OF WORLD RECORDS TA
Manasanamaha : గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ‘మనసానమః’ షార్ట్ ఫిల్మ్..
గిన్నీస్ బుక్‌లోకి తెలుగు షార్ట్ ఫిల్మ్ (Twitter/Photo)
Manasanamaha - Guinness Book of World Records :మనసానమ: తెలుగు ష్టార్ట్ ఫిల్మ్. ఈ పొట్టి చిత్రం అనేక జాతీయ, అంతర్జాతీయంగా అత్యధిక పురస్కారాలు గెల్చుకున్న చిత్రంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.
Manasanamaha - Guinness Book of World Records : విరాజ్ అశ్విన్ నటించిన షార్ట్ ఫిలిం మనసానమః తన రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సహా ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లింది ఈ లఘు చిత్రం. అంతేకాదు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్లో బెస్ట్ షార్ట్ ఫిలింగా ఎంపికై ఆశ్చర్యపరిచింది. తాజాగా "మనసానమః" జాతీయ, అంతర్జాతీయంగా అత్యధిక పురస్కారాలు గెల్చుకున్న చిత్రంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. గిన్నీస్ రికార్డ్స్ లో ఎక్కిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది.మనసానమఃలో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా మనసానమహా షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. యూట్యూబ్ లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది.
ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది. తాజాగా గిన్నీస్ బుక్ లోనూ చోటు దక్కించుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. మొత్తంగా తొలి ప్రయత్నంలోనే విరాజ్ అశ్విన్ నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇపుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకోవడం చూసి సినీ ప్రముఖులు ఈ చిత్ర దర్శక, నిర్మాతలను ప్రశంసలతో ముంచెత్తున్నారు.
విరాజ్ అశ్విన్ నటించిన షార్ట్ ఫిలిం మనసానమః తన రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సహా ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లింది ఈ లఘు చిత్రం. మొత్తంగా ఒక తెలుగు సినిమా ఈ స్థాయి వెళ్లడంపై అందరు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.