హోమ్ /వార్తలు /సినిమా /

Manam@8 Years: అక్కినేని ఫ్యామిలీకి మరిచిపోలేని చిత్రం ’మనం’ 8 యేళ్లు పూర్తి.. తెర వెనక స్టోరీ..

Manam@8 Years: అక్కినేని ఫ్యామిలీకి మరిచిపోలేని చిత్రం ’మనం’ 8 యేళ్లు పూర్తి.. తెర వెనక స్టోరీ..

‘మనం’ సినిమాకు 8 యేళ్లు పూర్తి (Twitter/Photo)

‘మనం’ సినిమాకు 8 యేళ్లు పూర్తి (Twitter/Photo)

Manam @8 Years | అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘మనం’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున స్వీయ నిర్మాణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి చెందిన అందరూ హీరోలు నటించడం విశేషం. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అంతేకాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ క్లాసిక్‌గా నిలిచింది.

ఇంకా చదవండి ...

ఒకే ప్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు ఒకే సినిమాలో నటించడం అనేది చాలా రేర్. అలాంటి అద్భుతమైన రికార్డు టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీ సొంతం చేసుకుంది. అక్కినేని నాగేశ్వరరావుకు కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలైన ఏఎన్నార్‌తో పాటు నాగార్జున, నాగ చైతన్య, అఖిల ఒకే సినిమాలో కలిసి నటించారు. తెలుగులో ఈ రేర్ ఫీట్ అందుకున్న ఫ్యామిలీ అక్కినేని వారిదే అనే చెప్పాలి. (Twitter/Photo)

సరిగ్గా ఆరేళ్ల క్రితం 23 మే 2014లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని అప్పట్లోనే రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల షేర్ రాబట్టి సంచలన విజయం సాధించింది. (Twitter/Photo)

అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘మనం’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున స్వీయ నిర్మాణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి చెందిన అందరూ హీరోలు నటించడం విశేషం. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. (Twitter/Photo)

నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో నాగార్జున సరసన శ్రియ హీరోయిన్‌గా నటించింది. ఇక సమంత కూడా అనుకోకుండా ఈ సినిమాలో భాగం అయింది. ఆ తర్వాత ఆమె అక్కినేని ఇంటి కోడలు కావడం విశేషం. ఆ తర్వాత సమంత అక్కినేని నాగ చైతన్యతో విడిపోవడం కూడా జరిగింది. (Twitter/Photo)

అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం మనం. ఈ సినిమాను ఏఎన్నార్ చూడకుండానే కనుమూయడం విషాదకరం (Twitter/Credit)

ఈ సినిమాలో నాగార్జున ..నాగ చైతన్య కొడుకుగా నటించడం.. నాగేశ్వరరావు నాగార్జున కొడుకుగా నటించడం వంటి చిత్ర విచిత్రాలు ఈ సినిమాలో జరిగాయి. (Twitter/Photo)

అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు హీరోలు ఏఎన్నార్, నాగార్జున, నాగ చైతన్య కలిసి ఈ సినిమాలో నటించారు. (Twitter/Photo)

అక్కినేని మూడు తరాల హీరోలు మనం సినిమాలో కలిసి నటించడం విశేషం. తెలుగులో ఆ ఘనత దక్కించుకున్న ఏకైక ఫ్యామిలీ అక్కినేనిదే కావడం మరో గొప్ప విశేషం. మొత్తంగా మనం సినిమా స్టోరీ అనేది అక్కినేని ఫ్యామిలీ కోసమే పుట్టిందనే చెప్పాలి.  (Twitter/Photo)

మొత్తంగా అక్కినేని నాగేశ్వర రావు జీవితం ‘ధర్మపత్ని’ సినిమాతో మొదలై.. ‘సీతారామ జననం’ సినిమాతో హీరోగా మారి ‘మనం’ సినిమాతో హీరోగానే కెరీర్ ముగించి కన్నుమూయడం విశేషం. (Twitter/Photo)

First published:

Tags: ANR, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Tollywood

ఉత్తమ కథలు