కాబోయేవాడి ఫోటో లీక్ చేసిన హీరోయిన్ అర్చన..? ముద్దు పెడుతూ..

తన జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన అర్చన.. మొత్తానికి అతనెవరో బయటపెట్టేసింది అంటున్నారు.త్వరలోనే వీరిద్దరు మూడు ముళ్లతో ఒక్కటవబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: September 13, 2019, 4:02 PM IST
కాబోయేవాడి ఫోటో లీక్ చేసిన హీరోయిన్ అర్చన..? ముద్దు పెడుతూ..
హీరోయిన్ అర్చన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటో
  • Share this:
హీరోయిన్ అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా.. అంటే అవుననే ఊహాగానాలే వినిపిస్తున్నాయి.అర్చన తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటోలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఓ అబ్బాయి తన నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటోను అర్చన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.త్వరలోనే అందరికీ గ్రేట్ న్యూస్ చెప్పబోతున్నానని.. అప్పటివరకు ఈ మూమెంట్స్‌ను మీరు కూడా ఎంజాయ్ చేయండి అని ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొంది. తన జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన అర్చన.. మొత్తానికి అతనెవరో బయటపెట్టేసింది అంటున్నారు.త్వరలోనే వీరిద్దరు మూడు ముళ్లతో ఒక్కటవబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

కాగా, 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ,తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో
హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా అందరికీ గుర్తుండిపోయింది. సినీ కెరీర్ ఇక ముగిసినట్టే కనిపిస్తుండటంతో అర్చన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు