ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (Vijay Setupathi)కి ఊహించని ఘటన ఎదురైంది. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో విమానం దిగి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆగంతకుడిని పట్టుకున్నారు. దాడి జరిగిన అనంతరం విజయ్ సేతుపతి ఆ వ్యక్తిని ఏమీ అనకుండా ఎటువంటి కేసు నమోదు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఆయనపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. చాలా మంది అంత మంచి వ్యక్తి, స్టార్ హీరోపై దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఏం జరిగింది..
బెంగళూరు ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవంబర్ 2, 2021 బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kempegowda International Airport in Bengaluru) ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు. అతను విజయ్ సేతుపతి ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్తున్నప్పుడు గమనించి సెల్ఫీ కోసం ఆయన వద్దకు వచ్చాడు.
అయితే, విజయ్ ఆ వ్యక్తి మద్యం తాగి ఉండడంతోపాటు మద్యం వాసన ఎక్కువగా వస్తుండడంతో అతడి ఆ అభ్యర్థనను తిరస్కరించాడు. కానీ అతను వినకుండా సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. దీంతో విజయ్ సేతుపతి పీఏ సెల్ఫీ కోసం వచ్చిన వ్యక్తిని దూరంగా నెట్టాడు. వెంటనే ఆ వ్యక్తి విజయ్ సేతు పతి పీఏను కొట్టాడు.
Actor #VijaySethupathi attacked in Bengaluru Airport. pic.twitter.com/lyJkeraFTO
— Manobala Vijayabalan (@ManobalaV) November 3, 2021
ఇది గమనించిన విమానాశ్రయ భద్రతా (Airport Security) సిబ్బంది, పోలీసులు పరిస్థితిని ఉద్రిక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. దాడి చేసిన వ్యక్తిపై విజయ్ సేతుపతి బృందం ఎటువంటి కేసు నమోదు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో చోటుచేసుకున్న దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభిమాన హీరోపై దాడి జరగడాన్ని జీర్ణించుకోలేకపోతోన్న విజయ్ సేతుపతి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airport, Attack, Bengaluru, Vijay Sethupathi