news18-telugu
Updated: October 5, 2019, 7:23 PM IST
మమ్ముట్టి, మోహన్‌లాల్ (File Photo)
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. టాలీవుడ్లో మలయాళ డబ్బింగ్ సినిమాలతో పాటు డైరెక్ట్‌గా ‘స్వాతి కిరణం’‘సూర్యపుత్రులు’, ‘రైల్వే కూలీ’, రీసెంట్గా ‘యాత్ర’ చిత్రాలతో మన ఆడియన్స్‌ను పలకరించాడు. మరోవైపు మమ్ముట్టి తోటి నటుడు మోహన్ లాల్ కూడా మల్లువుడ్‌లో అగ్ర కథానాయికుడిగా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకున్నాడు. మోహన్ లాల్ కూడా తెలుగులో ‘గాండీవం’తో పాటు ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా మమ్ముట్టి హీరోగా ‘మామంగం’ అనే మలయాళ జానపద సినిమా చేసాడు. ఈ సినిమా మలయాళంతో పాటు తమిళ్,తెలుగు, కన్నడ,హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ‘మమంగం’ సినిమాను కేరళలో అతి ప్రాచీనమైన కలరి విద్యలో విశిష్టతను చెప్పేలా తెరకెక్కించారు. ఈ చిత్రం నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సినిమాను జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా మమ్ముట్టి ఒక ఇంగ్లీషు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ లాల్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

మమ్ముట్టి, మోహన్‌లాల్ (File Photo)
మోహన్ లాల్ నేను హీరోలుగా స్టార్ డమ్ అందుకోకముందు నుంచే మా మధ్య మంచి స్నేహం ఉండేదని చెప్పుకొచ్చాడు. మేమిద్దరం పాత్రల, నటన విషయంలో మాత్రమే పోటీ పడతాం. మా ఇద్దరి మధ్య వృత్తిగత జీవితంలో తప్పించి వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి పోటీ లేదని చెప్పాడు. ఇక మమ్ముట్టి హీరోగా నటించిన ‘మమాంగం’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 5, 2019, 7:23 PM IST