‘బాహుబలి’, ‘సైరా’, బాటలో మమ్ముట్టి ‘మమాంగం’.. ట్రైలర్‌తో అదరగొట్టారుగా..

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కేరళలో 16 శతాబ్ధంలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ‘మమాంగం’ అనే సినిమా చేసారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మమాంగం’ టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: December 4, 2019, 8:11 AM IST
‘బాహుబలి’, ‘సైరా’, బాటలో మమ్ముట్టి ‘మమాంగం’.. ట్రైలర్‌తో అదరగొట్టారుగా..
మమ్ముట్టి ‘మమాంగం’ ట్రైలర్ విడుదల (News18/English)
  • Share this:
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇక ‘బాహుబలి’ సినిమా బయోపిక్ కాకపోయినా.. ఫిక్షనల్ స్టోరీగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించింది. ‘బాహుబలి’ సినిమా ఇచ్చిన స్పూర్తితో అన్ని ఇండస్ట్రీస్ వాళ్లు ఆయా ప్రాంతాల్లో జరిగిన నిజ జీవిత గాథలను వెండితెరపై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి చరిత్ర మరిచిన యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథను ‘సైరా నరసింహారెడ్డి’గా తెరకెక్కించాడు. అంతకు ముందు బాలకృష్ణ కూడా ‘గౌతమిపత్ర శాతకర్ణి’ వంటి శక పురుషుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించాడు. ఇక హిందీలో అజయ్ దేవ్‌గణ్ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర సుబేదార్‌గా పనిచేసిన  ‘తానాజీ’ జీవిత కథతో సినిమాను తెరకెక్కించారు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కేరళలో 16 శతాబ్ధంలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ‘మమాంగం’ అనే సినిమా చేసారు. తెలుగులో ఈ సినిమాను అదే టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్  చేస్తున్నారు. ప్రతి పన్నెండెళ్లకు ఒకసారి జరిగే ‘మమాంగం’ అనే ఉత్సవం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌లో పోరాటాలు చూస్తుంటే.. సెట్స్‌లో ఎక్కడ కృత్రిమత్వం లేదు. మరి ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...