పవన్ కళ్యాన్‌తో సినిమా చేయనన్న ఆ నటుడు..

అవును పవన్ కళ్యాణ్‌తో సినిమాలో నటించను అని నిర్మాత అల్లు అరవింద్ ముఖం మీదే చెప్పేసారు ఓ స్టార్ హీరో.

news18-telugu
Updated: December 4, 2019, 9:18 AM IST
పవన్ కళ్యాన్‌తో సినిమా చేయనన్న ఆ నటుడు..
పవన్ కళ్యాణ్ (Instagram/Photo)
  • Share this:
అవును పవన్ కళ్యాణ్‌తో సినిమాలో నటించను అని నిర్మాత అల్లు అరవింద్ ముఖం మీదే చెప్పేసారు ఓ స్టార్ హీరో. ఇంతకీ అతనెవరో కాదు మలయాళ సూపర్ స్టార్ మమ్మట్టి. గతంలో మమ్ముట్టిని అల్లు అరవింద్ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా నటిస్తారా అని అడిగారట. అల్లు అరవింద్ ఆ ప్రశ్న వేయగానే.. మమ్ముట్టి చాలా తెలివిగా అరవింద్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారట. నాకు అడిగిన ప్రశ్నను మీరు చిరంజీవిని అడగగలరా ? అని అరవింద్ ‌ను ఎదురు ప్రశ్నించారట. దానికి అల్లు అరవింద్ నేను అడగలేను అని అనగానే మమ్ముట్టి కామ్‌గా ఫోన్ కట్ చేశారట. ఈ విషయాన్ని అల్లు అరవింద్.. ‘మామాంగం’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వెల్లడించారు. ఇక మమ్ముట్టి విషయానికొస్తే.. తెలుగులో ఎన్నో డబ్బింగ్ సినిమాలతో పలకరించన ఈయన.. తెలుగులో డైరెక్ట్‌గా ‘స్వాతి కిరణం’, ‘సూర్య పుత్రులు’, ‘రైల్వే కూలీ’, ‘యాత్ర’ వంటి సినిమాలు చేయడమే కాదు.. అన్ని సినిమాల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మమ్ముట్టి స్పెషాలిటీ.
First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading