news18
Updated: November 9, 2020, 2:28 PM IST
మల్లికా షెరావత్, కమలా హారిస్ (ఫైల్)
- News18
- Last Updated:
November 9, 2020, 2:28 PM IST
బాలీవుడ్ సెక్స్ బాంబ్ గా పేరున్న మల్లికా షెరావత్ గుర్తుంది కదా..? మర్డర్, ఆషిక్ బనాయే అప్నే, ది మిత్ వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. కొద్దికాలంగా ఫేడ్ అవుట్ అయ్యారు. అప్పట్లో పలు హాలీవుడ్ సినిమాలలో నటించినా.. అందులోనూ పెద్దగా పేరు రాలేదు. కానీ రెండు, మూడు రోజులుగా ఆమె పేరు మళ్లీ సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నది. ఒక వ్యక్తితో గతంలో తీయించుకున్న ఫోటో.. వైరల్ గా మారింది. తనకు సంబంధించిన ఫోటోతో ఆమె ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఇంతకీ ఏంటా ఫోటో..? ఆమె కలిసింది ఎవరిని..? ఏంటీ కథా కమామిషు...?
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్.. కాబోయే అమెరికా ఉపాధ్యక్షురాలిని కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె ఫేస్బుక్ లో పంచుకున్నారు. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటి..? కమలా హారిస్ ఇంకా అమెరికా ఎన్నికల ఫలితాల ప్రక్రయ మీదే బిజీబిజీగా గడుపుతున్నారు. ఆమె ఊపిరిసలపనంత బిజీలో.. మల్లికా ను ఎప్పుడు కలిశారనుకుంటున్నారా..? ఆగండాగండి..! ఆ ఫోటో ఇప్పటిది కాదు.
2011 లో హాలీవుడ్ లో పాలిటిక్స్ ఆఫ్ లవ్ అనే ఒక సినిమా వచ్చింది. అందులో మల్లికా కీలక పాత్ర పోషించారు. ఆ చిత్రానికి సంబంధించిన సన్నాహాలలో భాగంగా 2009 లో మల్లికా.. శాన్ ప్రాన్సిస్కో కు వెళ్లింది. అక్కడే కమలా హారిస్ ను కలుసుకున్నారు. అప్పుడు ఆమె తీసుకున్న ఫోటోనే.. తాజాగా మల్లికా ఫేస్బుక్ లో పోస్టు చేశారు. ఆ సమయంలో కమలా హారిస్ శాన్ ఫ్రాన్సిస్కో కు అటార్నీ జనరల్ గా ఉన్నారు.
పాలిటిక్స్ ఆఫ్ లవ్ లో మల్లికా చేసిన పాత్రకు స్పూర్తి కమలానే ఆమె చెప్పుకొచ్చారు.
ఇదే విషయమై ఆమె ట్విట్టర్ ఖాతాలో.. గతంలో ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతున్నది. ఆ ట్వీట్ లో ఆమె.. ‘కమలా హారిస్ యూఎస్ ప్రెసిడెంట్ కావొచ్చు..’ అంటూ రాసుకొచ్చింది.
Published by:
Srinivas Munigala
First published:
November 9, 2020, 2:14 PM IST