నాగబాబును రీప్లేస్ చేసే జడ్జ్‌కి మల్లెమాల టీమ్ వెరైటీ కండిషన్స్..

జబర్ధస్త్ షో నాగబాబు ప్లేస్‌లో రావడానికి కొంత మంది సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపెడుతున్న మల్లెమాల సంస్థ పెడుతున్న కండిషన్స్ చూసి అవాక్కవుతున్నారు.

news18-telugu
Updated: December 3, 2019, 7:28 AM IST
నాగబాబును రీప్లేస్ చేసే జడ్జ్‌కి మల్లెమాల టీమ్ వెరైటీ కండిషన్స్..
నాగబాబు (file photo)
  • Share this:
జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకు వచ్చిసేనా సంగతి తెలిసిందే కదా. జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ పేరుతో కొత్త షోకు మెగా బ్రదర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. జబర్దస్త్ షోలో నాగబాబు ప్లేస్‌‌ను ఆలీ తో రీప్లేస్ చేద్దామనుకున్నారు జబర్ధస్త్ షో నిర్వాహకులు. కానీ కొన్ని కారణాల వల్ల అది వీలు పడలేదు. దాంతో సీనియర్ హీరోలు నరేష్, సాయి కుమార్‌లను మల్లెమాల సంస్థ ఇప్పటికే సంప్రదించింది.  ప్రస్తుతానికైతే.. రోజా ఒక్కరితోనే ఈ షోను కంటిన్యూ చేయాలనున్నట్టు మల్లెమాల వాళ్లు ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ఇది వరకటి కంటే ఆమెకు కాస్త ఎక్కువగానే పారితోషకం ఇస్తున్నారు. నిజానికి జబర్దస్త్ షోలో నాగబాబు పెద్దగా నవ్వడం తప్ప మరే  పని చేయలేదని విమర్శించే వాళ్లునన్నారు. కానీ నాగబాబు ఈ షో నడిపించడానికి తెర వెనక చేసిన ప్రయత్నాలు చాలానే ఉన్నాయి.  ఈ షోకు సంబంధించి కమెడియన్స్‌ను కంట్రోల్ చేయడంతో పాటు టెక్నికల్ టీమ్‌ను ఒక తాటిపై తీసుకొచ్చి ఈ షో సకాలంలో పూర్తైయ్యేటట్టు చేయడంలో నాగబాబు పాత్రను మరవలేనిదనే అందరు చెప్పుకుంటున్నారు.

After the Exit of Nagababu Jabardasth Comedians remuneration increased and jackpot for Sudheer Hyper Aadhi pk జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో మార్పులు చేర్పులు జోరుగా జరుగుతున్నాయి. నాగబాబు బయటికి వెళ్లిపోయిన తర్వాత మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు.. jabardasth comedy show,Jabardasth Katharnak Comedy Show,jabardasth controversy skits,jabardasth comedians remunerations,jabardasth chammak chandra remuneration,jabardasth roja remuneration,jabardasth naga babu remuneration,sudigali sudheer remuneration,hyper aadi remuneration jabardasth,jabardasth naresh attacked,jabardasth naresh attack,Jabardasth Show,etv Jabardasth Katharnak Comedy Show,etv Jabardasth,jabardasth controversy,jabardasth,jabardasth controversy videos,jabardasth controversy hyper aadi,jabardasth comedians,jabardasth comedians salary,jabardasth naga babu,jabardasth roja,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ల రెమ్యునరేషన్,నాగబాబు రోజా రెమ్యునరేషన్,రష్మి అనసూయ రెమ్యునరేషన్,ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కాంట్రవర్సీలు,జబర్దస్త్ వివాదాలు,జబర్దస్త్ నరేష్‌పై దాడి,జబర్దస్త్ సుడిగాలి సుధీర్,జబర్దస్త్ హైపర్ ఆది,తెలుగు సినిమా
నాగబాబు రోజా (Source: Youtube)


మరోవైపు జబర్ధస్త్ షో నాగబాబు ప్లేస్‌లో రావడానికి కొంత మంది సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపెడుతున్న మల్లెమాల సంస్థ ఈ షో చేయడం కోసం వచ్చే సెలబ్రిటీల ముందు 7పేజీల అగ్రిమెంట్‌ను సైన్ చేయాలనే కండిషన్స్ పెడుతున్నారట. ఆ కండిషన్స్ చూసి చాలా మంది ఈ షోకు జడ్జ్‌గా చేయాలనుకునే వారు కాస్త  భయపడుతున్నారని టాక్. ఈ షోకు జడ్జ్‌గా చేసేవాళ్లు వేరే ఏ షో చేయాలన్నా.. వేరే ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయాలన్నమల్లెమాల వాళ్లను సంప్రదించి కానీ నిర్ణయం తీసుకోవడానికి లేదు. అందుకే జడ్జ్‌గా చేయడానికి ముందు కొచ్చిన సెలబ్రిటీలు.. ఈ కండిషన్స్ చూసి వెనక్కి తగ్గతున్నారట. మల్లెమాల వాళ్లు మాత్రం ఈ కండిషన్స్‌ను ఒప్పుకున్నవాళ్లనే జడ్జ్‌గా నియమించాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి జబర్ధస్త్ షోలో నాగబాబు ప్లేస్‌ను రీప్లేస్ చేయాలనుకునే వారు ఈ కండిషన్స్ ఒప్పుకుంటే కానీ షోలో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదన్నట్టు తయారైంది పరిస్థితి.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 3, 2019, 7:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading