హోమ్ /వార్తలు /సినిమా /

Maldives: తారల కొత్త విహార స్థలం మాల్దీవులు...ద్వీప దేశానికి క్యూ కడుతున్న నటీమణులు

Maldives: తారల కొత్త విహార స్థలం మాల్దీవులు...ద్వీప దేశానికి క్యూ కడుతున్న నటీమణులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో చాలా దేశాలు ముందు జాగ్రత్తలో భాగంగా భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి. తాజాగా.. జర్మనీ, ఇటలీ, మాల్దీవ్స్ కూడా భారత్ నుంచి ప్రయాణికులకు నో ఎంట్రీ అని ప్రకటించాయి.

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో చాలా దేశాలు ముందు జాగ్రత్తలో భాగంగా భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి. తాజాగా.. జర్మనీ, ఇటలీ, మాల్దీవ్స్ కూడా భారత్ నుంచి ప్రయాణికులకు నో ఎంట్రీ అని ప్రకటించాయి.

మాల్దీవులు.. భారతదేశానికి ఆనుకుని ఉన్న హిందూ మహా సముద్రంలో నైరుతిన శ్రీలంక కింది భాగంలో ఉన్న చిన్న దీవి. దాని విస్తీర్ణం చాలా తక్కువ. జనాభా కూడా 5 లక్షలకు మించదు. కానీ పర్యాటకులకు కొత్త destination spot అయింది.

 • News18
 • Last Updated :

  మాల్దీవులు.. భారతదేశానికి ఆనుకుని ఉన్న హిందూ మహా సముద్రంలో నైరుతిన శ్రీలంక కింది భాగంలో ఉన్న చిన్న దీవి. దాని విస్తీర్ణం చాలా తక్కువ. జనాభా కూడా 5 లక్షలకు మించదు. కానీ పర్యాటకులకు కొత్త destination spot అయింది. ముఖ్యంగా భారతీయ సినీ నటీమణులకైతే అదో స్వర్గంలా మారింది. అంతకుముందు నటీమణులంతా సేదతీరడానికి ఏ ప్యారిస్ కో.. స్పెయిన్ కో వెళ్లేవాళ్లు. కాల క్రమేణా దాని స్థానంలో థాయ్లాండ్, బ్యాంకాక్ వచ్చి చేరాయి. ఇక కరోనా నేపథ్యంలో దూర ప్రయాణాలు చేయడానికి నటీమణులు ఆసక్తి చూపడం లేదు. అలాగని వారు విహార యాత్రలను వదులుకోవడం లేదు.

  కరోనా కారణంగా షూటింగ్ లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు. దీంతో చాలా మంది సేదతీరడానికి మాల్దీవులనే ఎంచుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి మొదలుకుని.. కోలివుడ్, మల్లూవుడ్, సాండల్ వుడ్, బాలీవుడ్ నటీమణులంతా అక్కడ వాలిపోతున్నారు. అక్కడ స్వచ్ఛమైన బీచ్ లలో తిరగాడుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు.


  View this post on Instagram


  A post shared by Rakul Singh (@rakulpreet)  ఈ జాబితాలో చాలా మంది తెలుగు నటీమణులు కూడా ఉన్నారు. సమంత, రకుల్ ప్రీత్, ప్రణీత వంటి తారలతో పాటు.. ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ కూడా తన హనీమూన్ ను మాల్దీవులనే ఎంచుకుంది.  ఇక బాలీవుడ్ లో అయితే మాల్దీవులు సందర్శించని హీరోయిన్ లేదంటే అతి శయోక్తి కాదేమో..


  View this post on Instagram


  A post shared by Katrina Kaif (@katrinakaif)

  చిన్న దేశమే అయినా.. దానికి చుట్టూ ఉన్న సముద్రంతో అది పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతున్నది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఈ దీవులలో.. పర్యాటక రంగంపై ఎక్కువగా దృష్టి సారించడం గమనార్హం. స్వచ్ఛమైన బీచ్ లు.. కాలుష్యరహిత సముద్రం... అండర్ వాటర్ లో విహారం.. సముద్రంలోనే కాటేజీలు.. ఇవన్నీ మాల్దీవులకు వెళ్లడానికి ఆకర్షిస్తున్నాయి.
  View this post on Instagram


  A post shared by TARA💫 (@tarasutaria)  మాల్దీవులలో ఎప్పుడైనా వెళ్లొచ్చు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో వెళ్లడానికి అనువైన సమయం. ఈ కాలంలో అక్కడి ఉష్ణోగ్రత పర్యాటకానికి అనుకూలంగా ఉంటుంది.


  View this post on Instagram


  A post shared by SOPHIE (@sophiechoudry)  సుమారు 1,200 దీవులున్న మాల్దీవులు.. ఒక ద్వీప సమూహం. ఇక్కడ ఇతర దేశాలతో పోల్చితే నిర్భంధాలు తక్కువ.  పర్యాటకులను ఖుషి చేయడానికి వందలాది రిసార్ట్ లు, కాటేజీలు సిద్ధంగా ఉన్నాయి.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Bollywood heroine, Disha Patani, Kajal agarwal, Katrina Kaif, Maldives, Rakul Preet Singh, Samantha akkineni

  ఉత్తమ కథలు