జ్యోతిక సినిమాను మెచ్చుకున్న విదేశీ మంత్రి .. వైరల్ అవుతున్న న్యూస్..

ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లుగా తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న సినిమాలతో ప్రస్తుతం సౌతిండియా పేరు మారుమ్రోగిపోతోంది. అయితే మలేషియా విద్యాశాఖ మంత్రి ప్రముఖ నటి జ్యోతిక నటించిన ‘రాక్షసి’ సినిమా పై చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ సౌతిండియా సినిమాకు అంతర్జ్యాతీయ ఖ్యాతి తీసుకువొచ్చింది.

news18-telugu
Updated: September 6, 2019, 9:49 AM IST
జ్యోతిక సినిమాను మెచ్చుకున్న విదేశీ మంత్రి .. వైరల్ అవుతున్న న్యూస్..
రాక్షసి మూవీలో జ్యోతిక (File /Photo)
news18-telugu
Updated: September 6, 2019, 9:49 AM IST
గత కొంతకాలంగా ఇండియన్ సినిమాలో దక్షిణాది సినిమాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునే పరిస్థితిలో ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లుగా తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న సినిమాలతో ప్రస్తుతం సౌతిండియా పేరు మారుమ్రోగిపోతోంది. అయితే మలేషియా విద్యాశాఖ మంత్రి ప్రముఖ నటి జ్యోతిక నటించిన ‘రాక్షసి’ సినిమా పై చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ సౌతిండియా సినిమాకు అంతర్జ్యాతీయ ఖ్యాతి తీసుకువొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్ట్ తాలుక వివరాలలోకి వెళితే....
నటి జ్యోతిక నట జీవితం వివాహానంతరం కూడా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇటీవల జ్యోతిక లీడ్ రోల్‌లో నటించిన ‘రాక్షసి’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథ, కథనాలు, నటన అద్భుతంగా ఉండటంతో సినిమాను జనాలు బాగా ఆదరించారు.ఇందులో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి పాత్రలో అద్భుత నటనతో అలరించింది. తాజాగా ఈ మూవీపై మలేషియా విద్యాశాఖ మంత్రి మస్‌జ్లీ బిన్‌ మాలిక్‌ ప్రశంసల జల్లు కురిపించారు.

జ్యోతిక సినిమాపై మలేషియన్ మంత్రి ప్రశంసలు (Youtube/Credit)


ఈ సినిమాను చూసిన మలేషియా మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిప్రాయాలను పోస్ట్‌ చేశారు. ‘రెండు నెలల క్రితం ఈ సినిమా విడుదలైంది. రీసెంట్‌గా ఈ సినిమాను అధికారులతో కలిసి  చూశాను. స్వయంగా ఈ సినిమా రివ్యూ రాయాలని నిర్ణయించుకున్నా. ఇది అందరూ చూడాల్సిన సినిమా. కథ అద్భుతంగా ఉందన్నారు.





 
Loading...




View this post on Instagram




 

Dua bulan lepas filem ini keluar. Semalam saya menontonnya bersama pegawai-pegawai. Saya akan tulis artikel mengulas filem ini. Yang pasti, filem ini memang wajib tonton. Jalan ceritanya luar biasa. Wataknya sempurna. Berbeza rasanya menonton sebagai Menteri Pendidikan. Setiap babak sentiasa saya refleksikan dengan keadaan di negara kita. Geetha Rani adalah watak pengetua adiwira yang sangat hebat. Beliau membuktikan kepada kita bahawa perubahan yang besar itu bukanlah mustahil. Banyak sekali dasar dan perubahan yang kita sedang gubal untuk dilaksanakan telah berjaya digambarkan dalam filem ini. Misalnya inisiatif PSP (Program Sarapan Percuma). Filem ini menterjemahkan aspirasi saya yang lebih dari sekadar makanan, tetapi saya ingin melihat guru-guru boleh duduk makan sekali dengan anak-anak kita. Begitu juga dengan isu keciciran murid. Geetha telah berjaya melibatkan semua pihak untuk atasi isu keciciran murid, termasuklah pihak polis. Ini yang sedang kita usahakan. Kita nak pastikan ‘enforcement’ itu berlaku di semua penjuru agar tak ada lagi kanak-kanak yang tercicir. Bukan itu sahaja. Geetha juga berjumpa dengan semua ibu bapa pelajar. Tubuhkan semacam Persatuan Ibu Bapa dan Komuniti (PIBK) untuk pastikan ibu bapa ini terlibat aktif dengan pendidikan anak-anak mereka. Menjadikan pendidikan adalah visi kolektif semua pihak adalah antara hasrat terbesar saya. Kerana saya yakin, pendidikan harus berupaya menjadi objektif komuniti setempat, malah pendidikanlah yang akan meningkatkan taraf hidup mereka. Semua pendidik, ibu bapa, murid-murid dan sesiapa sahaja, saya sarankan untuk tonton filem ini. Segera!


A post shared by MM (@maszlee) on






జ్యోతిక పాత్ర పర్‌ఫెక్ట్‌గా ఉంది. విద్యా శాఖ మంత్రిగా ఈ సినిమా చూడటం విభిన్న అనుభూతినిచ్చింది. సినిమాలోని ప్రతి సన్నివేశం మా దేశ పరిస్థితుల్ని ప్రతిబింబించింది’. విద్యార్థులు, తల్లిదండ్రులు, చదువుకున్న వారు, అందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా’ అని ఆయన ఓ సుదీర్ఘ పోస్ట్‌ చేసారు.
First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...