మాస్ మహారాజ రవితేజ ఈ సంక్రాంతికి విడుదలైన 'క్రాక్'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అంతే కాదండోయ్ కెరీర్ బెస్ట్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు రవితేజ. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో 'ఖిలాఢి' సినిమాను పూర్తి చేస్తున్నాడు రవితేజ. అప్పటి వరకు రవితేజతో సినిమా చేయడానికి కాస్త వెనుకా ముందు ఆలోచించిన ఈ సినిమా నిర్మాతలు క్రాక్ సక్సెస్ భారీ బడ్జెట్‌తో 'ఖిలాఢి' సినిమాను చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో ఉన్న తారాగణంతో పాటు ఇద్దరు స్టార్స్ కూడా యాడ్ అవుతున్నారు. అందులో ఒకరు యాక్షన్ కింగ్ అర్జున్ కాగా.. మరొకరు మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్. రీసెంట్‌గానే అర్జున్ తమ యూనిట్‌తో జాయిన్ అవుతున్నట్లు అనౌన్స్ చేసిన దర్శక నిర్మాతలు ఇప్పుడు ఉన్ని ముకుందన్ యూనిట్‌తో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు.
హీరో అర్జున్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత విలన్‌గానూ నటిస్తున్నారు. ఆ కోవలో ఖిలాఢిలో అర్జున్ మెయిన్ విలన్‌గా కనిపించబోతునట్లు సమాచారం. మరి ఉన్ని ముకుందన్ ఎలాంటి పాత్ర చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఉన్ని ముకుందన్‌కు తెలుగు సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. ఇది వరకు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతాగ్యారేజ్‌లో ఉన్ని ముకుందన్ నటించాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడిగా, విలన్‌గా ఉన్ని ముకుందన్ నటన అందరినీ ఆకట్టుకుంది. తర్వాత అనుష్క టైటిల్ పాత్రలో నటించిన భాగమతి చిత్రంలోనూ అనుష్క లవర్ పాత్రలో ఉన్ని ముకుందన్ నటించాడు. తర్వాత మరే తెలుగు సినిమాలో ఆయన నటించలేదు. 2018లో భాగమతి విడుదలైంది.

Malayam Star Unni Mukundan play key role in Raviteja Khiladi Movie
అంటే దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఉన్ని ముకుందన్ తెలుగులో నటించబోతున్నాడు. 'ఖిలాఢి' సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. గతంలో వీర వంటి ప్లాప్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు రమేశ్ వర్మపై నమ్మకంతో రవితేజ మరోసారి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు. రమేశ్ వర్మ గత చిత్రం రాక్షసుడు మంచి విజయాన్ని సాధించింది. మరి ఈసారి రవితేజతో రమేశ్ వర్మ ఎలాంటి సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.