MALAYALI BEAUTY MANASA RADHAKRISHNAN MAY ACT AS HEROIN IN PAWAN KALYAN HARISH SHANKAR MOVIE TA
PSPK28: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాకు టైటిల్‌తో పాటు హీరోయిన్ ఖరారు..
పవన్ కళ్యాణ్ సరసన మానస రాధాకృష్ణన్ (Twitter/Pawan kalyan Manasa Ramakrishnan)
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు టైటిల్‌తో పాటు పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ను ఖరారు చేసారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాాలతో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ముందుగా దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇలియానా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అనుష్కను హీరోయిన్గా అనుకుంటున్న ఈ సినిమాను చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో షూటింగ్స్ అన్ని తాత్కాలింగా వాయిదా వేసారు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈచిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ (Twitter/Photo)
ఇక పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ సినిమా అనగానే అందరికీ గబ్బర్ సింగ్ సినిమానే గుర్తుకు వస్తోంది. హిందీలో హిట్టైన ‘దబాంగ్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు హరీస్ శంకర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు ఇప్పటికీ పవన్ అభిమానులు మరిచిపోలేదు.తాజాగా వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రం గబ్బర్ సింగ్ సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు. దీనిపై హరీష్ శంకర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఈ సినిమా రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. అది నిజంకాదు.. పవన్ కళ్యాణ్ కోసం ఎపుడో ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేసి పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చాడు.సరికొత్త కథతోనే పవన్ కళ్యాణ్‌ను తెరపై చూపిస్తానని చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్గా మానస రాధాకృష్ణన్ (Twitter/Photo)
అంతేకాదు ఈ సినిమాకు గబ్బర్ సింగ్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మరోసారి సంగీతం సమకూర్చబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఖరారు అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో బాలనటిగా పరిచమైన ఈమె.. ఆ తర్వాత మలయాళ తెరపై హీరోయిన్గా సత్తా చూపెడుతోంది. ఇప్పటి వరకు మలయాళ చిత్రాలే తప్పించి వేరే భాషలో సినిమాలు చేయడని ఈమె పవన్ సినిమాలో ఖరారైతే.. ఇది ఆమెకు తొలి పరభాషా చిత్రం అవుతోంది. ఈ చిత్రానికి ’ఇపుడే మొదలైంది’ అనే టైటిల్ ఖరారు చేసారు. మొత్తానికి ఈమె పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తుందనే వార్తల్లో క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ ప్రకటన వెలుబడేవరకు వెయిట్ చేయాల్సిందే.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.