TV Actor: ప్రముఖ టీవీ సీరియల్ నటుడు ఆత్మహత్య యత్నం..

ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య యత్నం (Twitter/Photo)

TV Actor Adityan Jayan : మలయాళ టీవీ ఇండస్ట్రీలో ప్రముఖ సీరియల్ నటుడు ఆదిత్య జయన్ ఆత్మహత్యకు పాల్పడటం మలయాళ టీవీ పరిశ్రమలో కలకలం సృష్టించింది.

  • Share this:
    TV Actor Adityan Jayan : మలయాళ టీవీ ఇండస్ట్రీలో ప్రముఖ సీరియల్ నటుడు ఆదిత్య జయన్ ఆత్మహత్యకు పాల్పడటం మలయాళ టీవీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఈయన ఆదివారం సాయంత్రం కారు కూర్చొని తన చేతి మణికట్టు నరాలు కట్ చేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్రంగా రక్తం పోవడంతో అపస్మారక  స్థితిలో వెళ్లడంతో ఈ ఘటనను చూసిన కొందరు ఆయన్ని హుటాహుటిన దగ్గరలోని త్రిసూర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆదిత్య జయన్ తన చేతి నరాలు కట్ చేసుకునే ముందు అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి  విషమంగానే ఉన్నట్టు సమాచారం.

    ప్రముఖ టీవీ నటుడు ఆదిత్య జయన్ భార్య కూడా అంబిలి దేవి కూడా ప్రముఖ నటి. ఈమె రీసెంట్‌గా తన భర్త ఆమెను  దారుణంగా మోసం చేశాడంటూ  సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయమై ఆమె మీడియా ముందుకు కూడా వచ్చారు. అంతేకాదు తన భర్త తనకు విడాకులు ఇవ్వాలంటూ బలవంత పెడుతున్నట్టు వెల్లడించింది. అంతేకాదు ఈ సందర్భంగా తన భర్త విడాకులు ఇవ్వకుంటే చంపేస్తానంటూ బెదిరిస్తున్నట్టు పేర్కొంది. ఈ సందర్భంగా ఆదిత్య జయన్ తన భార్య చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవంటూ కొట్టిపారేసారు.

    ఆదిత్య జయన్ దంపతులు (File/Photo)


    ఏదో కొన్ని ఈగో క్లాషెస్‌ను దృష్టిలో పెట్టుకొని తన పరువు బజారు కీడ్చదంటూ భార్యతో పాటు మీడియాకు సూచించారు. ఇలాంటి సమయంలో ఆదిత్య జయన్ సూసైడ్ అటెంప్ట్ చేయడం మలయాళ టీవీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇక తొలిసారిగా వీళ్లిద్దరు  ‘సీత’ అనే సీరియల్‌లో భార్యభర్తలుగా నటించారు. అదే టైమ్‌లో వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. వీళ్లు 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అర్జున్ అనే అబ్బాయి ఉన్నాడు. ప్రస్తుతం ఆదిత్య ‘సీతా కల్యాణం’, ‘ఎంటె మాతవు’ అనే సీరియల్స్‌లో నటిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: