Mohanlal Chicken recipe: మోహన్ లాల్ చికెన్ కర్రీ టేస్ట్ చేస్తారా.. వీడియో వైరల్..!

మోహన్ లాల్ చికెన్ రెసిపీ (Mohanlal chicken recipe)

Mohanlal Chicken recipe: హీరోలు అంటే కేవలం యాక్టింగ్ వరకు మాత్రమే కాదు.. వంటలు కూడా బాగానే చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal Chicken recipe) కూడా వంటల్లో అగ్రగణ్యుడే.

  • Share this:
హీరోలు అంటే కేవలం యాక్టింగ్ వరకు మాత్రమే కాదు.. వంటలు కూడా బాగానే చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో అద్బుతమైన వంటగాళ్ళు ఉన్నారు. నాగ చైతన్య, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అద్భుతంగా వంట చేస్తారు. వాళ్ల వంటల వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా చిరంజీవి పేరు మీద ఏకంగా మెగాస్టార్ స్టీమ్ దోశ ఉంది. దాంతో పాటు భార్యకు ప్రేమతో నాగ చైతన్య ఎన్నో వంటలు చేసి పెడుతుంటాడు. మరోవైపు అప్పట్లో బిగ్ బాస్ సాక్షిగా బిర్యాని వండి పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోలు మంచి వంటగాళ్లే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా వంటల్లో అగ్రగణ్యుడే.

ఆయన కూడా చాలా వంటలు చేస్తుంటాడు. తాజాగా ఈయన చేసిన చికెన్ కర్రీ రెసిపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మసాలాలు అన్నీ గట్టిగా దట్టించి.. ఈయన వండిన చికెన్ కర్రీకి ఫిదా అయిపోతున్నారు అభిమానులు. ఆ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. స్పైసీ చికెన్ ఎలా ఉంటుందో చూస్తారా అంటూ ఈయన వీడియోను విడుదల చేసాడు. 5 నిమిషాలకు చేరువలో ఉన్న ఈ వీడియోకు లైకులు, కామెంట్స్ వేలల్లో, లక్షల్లో వస్తున్నాయి. ఫేస్ బుక్‌లో చికెన్ కర్రీ రెసిపీ చూపించాడు మోహన్ లాల్.

ఈయన ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. జనతా గ్యారేజ్, మనమంతా లాంటి సినిమాలతో తెలుగులోనూ నేరుగా ప్రేక్షకులను పలకరించాడు ఈయన. ఇప్పుడు మరక్కాడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు మరో అరడజన్ సినిమాలను కూడా లైన్‌లో పెట్టాడు మోహన్ లాల్. ఇంత బిజీలో కూడా వంటలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. మొత్తానికి మోహన్ లాల్ చికెన్ కర్రీ ఓ సారి మీరు కూడా చూసేయండి.
Published by:Praveen Kumar Vadla
First published: