Home /News /movies /

MALAYALAM STAR HEROES PRITHVIRAJ AND DULQUER SALMAAN ALLEGEDLY RACING ALONG THE KOTTAYAM KOCHI ROAD PK

ఆ స్టార్ హీరోలు జైలుకు వెళ్తారా.. వివాదంలో దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్..

దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ (dulquer salmaan)

దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ (dulquer salmaan)

Dulquer Salmaan: మలయాళ స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్‌, పృథ్వీరాజ్‌లు అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు. ఈ కరోనా సమయంలో నార్మల్ రోడ్లపై ఈ ఇద్దరు హీరోలు రేసింగ్..

మలయాళ స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్‌, పృథ్వీరాజ్‌లు అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు. ఈ కరోనా సమయంలో నార్మల్ రోడ్లపై ఈ ఇద్దరు హీరోలు రేసింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై జులై 23న మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్‌ విచారణకు ఆదేశించింది. అయితే ఆ వీడియో ఇప్పటిదేనా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పాత వీడియో అంటూ మరో వార్త కూడా వినిపిస్తుంది.
దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ (dulquer salmaan)
దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ (dulquer salmaan)

ఈ ఘటనపై మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్ రాజీవ్‌ పుతలత్‌ మాట్లాడుతూ దుల్కర్, పృథ్వీరాజ్ నిజంగానే ర్యాష్ డ్రైవింగ్‌ చేసారా లేదా అనేది మాత్రం విచారణ జరుగుతుంది. ఇందులో వాళ్లు భాగస్వాములుగా ఉన్నారా లేదా అనేది కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు అధికారులు. వాళ్లు రోడ్డు సురక్షిత నియమాలను ఉల్లంఘించినట్లు ఇంకా స్పష్టత రావట్లేదు. సీసీ కెమెరాలలో నియమాలకు ఉల్లంఘించినట్లు తేలితే మాత్రం కచ్చితంగా యజమానులకు నోటీసులు ఇస్తామని చెప్తున్నారు వెహికిల్ డిపార్ట్‌మెంట్ అధికారులు.

ఒకవేళ ఇందులో ఈ ఇద్దరు హీరోలు దోషులుగా తేలితే మాత్రం కచ్చితంగా మోటార్ వెహికల్ చట్టం 184 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామంటున్నారు వాళ్లు. అలాగే ఈ వీడియోను చిత్రీకరించిన ఇద్దరు బైక్‌పై ఓవర్‌ స్పీడ్‌గా వెళ్లినట్లు అర్థమవుతోంది. వాళ్లను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు వాళ్లు. దోషులుగా తేలితే వాళ్లకు 1500 రూపాయలు జరిమానాతో పాటు ఆర్నెళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. అయితే అక్కడున్నది ఈ ఇద్దరు హీరోలా కాదా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Dulquer salmaan, Malayala Cinema

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు