Home /News /movies /

MALAYALAM SINGER EDAVA BASHEER DIES AFTER COLLAPSING ON STAGE WHILE PERFORMING SB

Singer Death:సినీ ఇండస్ట్రీలో విషాదం.. స్టేజ్‌పై పాట పాడుతూ సింగర్ మృతి

మళయాళం సింగర్ మృతి

మళయాళం సింగర్ మృతి

ప్రముఖ మళయాళం సింగర్ బ్లూ డైమండ్స్ ఆర్కెస్ట్రా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

    సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దిగ్గజ మలయాళ సింగర్ ఎడవా బషీర్ (78) గుండెపోటుతో మృతి చెందారు. స్టేజీపై పాడుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేరళలోని అలప్పుజా జిల్లాలో బ్లూ డైమండ్స్ ఆర్కెస్ట్రా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

    'మానా హో తుమ్ బేహాద్ హసీన్...' అనే కేజే ఏసుదాస్ పాపులర్ హిందీ పాటను ఆలపిస్తూ బషీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన చేతిలో మైక్ పక్కకు పడిపోయింది. వెంటనే అక్కడున్నవారు బషీర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. కేరళలో ఆర్కెస్ట్రా కల్చర్‌ను పాపులర్ చేసినవారిలో ఎడవా బషీర్ పేరును ప్రముఖంగా చెబుతారు.

    తిరువనంతపురంలో జన్మించిన ఎడవా బషీర్ స్కూల్ వయసు నుంచే పాటలు పాడుతున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పాటలు పాడారు. ఎన్నో అంతర్జాతీయ వేదికలపై సైతం తన పాటను వినిపించారు. ప్లే బ్యాక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. బషీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Malayalam, Sandalwood News

    తదుపరి వార్తలు