ప్రముఖ మోడల్.. నటి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పుట్టినరోజే.. ఆమె చనిపోవడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ప్రముఖ మోడల్, నటి షహానా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గురువారం (మే 12) కాసర్ఘడ్లోని తన నివాసంలో 21వ పుట్టినరోజు జరుపుకున్న షహానా.. బాత్ రూంలో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. అర్ధరాత్రి ఒంటి గంటకు షహానా చనిపోయిందంటూ ఆమె తల్లితండ్రులకు ఫోన్ వచ్చింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన షహానా కుటుంబీకులు ఆమె చావుకు భర్త సజ్జద్ కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సజ్జద్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
20 ఏళ్ల చిన్న వయస్సు లోనే మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేశారు. షహానాకు 2021లో సజ్జద్తో వివాహం అయింది. వివాహం అనంతరం షహానా, సజ్జద్ మధ్య విబేధాలు వచ్చాయి. భర్త నుంచి తనకు ప్రాణహానీ ఉందని తల్లిదండ్రులకు ఆమె చాలాసార్లు ఫిర్యాదు చేశారు. చివరకు షహానా బాత్రూమ్లో శవమై కనిపించడంతో.. సజ్జద్ చిత్రహింసలు పెట్టినట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దాంతో సజ్జద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షహానా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
షహానా తల్లి మాట్లాడుతూ... 'నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు. ఆమెను చంపేశారు. అత్తారింట్లో తనను టార్చర్ పెడుతున్నారని చాలాసార్లు చెప్పింది. సజ్జద్ తాగొచ్చి నానా గొడవ చేసేవాడు. అతడి తల్లిదండ్రులు, సోదరి కూడా షహానాకి నరకం చూపించేవారు. దాంతో వేరు కాపురం పెట్టమని సూచించాను. ఇంటి నుంచి బయటకు వచ్చేసి అద్దెంట్లో ఉంటున్నారు. సజ్జద్ డబ్బు కోసం గొడవ చేస్తున్నాడని, దారుణంగా ప్రవర్తిస్తున్నాడని షహానా నాకు చెప్పింది. 25 సవర్ల బంగారాన్ని మాయం చేశాడు. పుట్టినరోజు మమ్మల్ని కలవాలనుకున్నా.. అందుకు అతడు ఒప్పుకోలేదు. రాత్రే షహానా చనిపోయింది' అని బోరున ఏడ్చేశారు.
మరోవైపు ఈ ఘటనపై అటు పోలీసులు కూడా స్పందించారు. షహానా తమిళ ప్రాజెక్టులో నటించినందుకు పారితోషికం రావడంతో... ఆ డబ్బుల కోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. షహానా బర్త్డే రోజు కూడా సజ్జద్ ఆలస్యంగా వచ్చాడని.. . దాంతో ఇద్దరు మరోసారి తీవ్ర స్థాయిలో గొడవపడ్డారని తెలిపారు. ఆ తర్వాత బాత్రూమ్లో షహానా శవమై కనిపించిందన్నారు. షహానా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సజ్జద్ను అదుపులోకి తీసుకున్నాం. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్నది దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.