Home /News /movies /

MALAYALAM LEGENDARY SCRIPT WRITER DIRECTOR DENNIS JOSEPH PASSED AWAY DUE TO HEART ATTACK PK

Dennis Joseph passes away: గుండెపోటుతో లెజెండరీ రైటర్, దర్శకుడు హఠాన్మరణం..

మలయాళ దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ కన్నుమూత (Dennis Joseph)

మలయాళ దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ కన్నుమూత (Dennis Joseph)

Dennis Joseph passes away: సినిమా ఇండస్ట్రీలో ఒకదాన్ని మించి మరో మహా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకి సినీ ప్రముఖులు మనకు దూరం అవుతున్నారు. TNR మరణం ఇంకా పచ్చిగా ఉండగానే.. అంతలోనే మరో మరణవార్త వినాల్సి వచ్చింది. ఈ సారి లెజెండరీ టెక్నీషియన్ కన్నుమూసారు.

ఇంకా చదవండి ...
సినిమా ఇండస్ట్రీలో ఒకదాన్ని మించి మరో మహా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకి సినీ ప్రముఖులు మనకు దూరం అవుతున్నారు. అందులో చాలా మంది కరోనా కాటుకు బలైపోతున్నారు. తెలుగులో జర్నలిస్ట్, నటుడు TNR మరణం ఇంకా పచ్చిగా ఉండగానే.. అంతలోనే మరో మరణవార్త వినాల్సి వచ్చింది. ఈ సారి లెజెండరీ టెక్నీషియన్ కన్నుమూసారు. అతడి పేరు డెన్నిస్ జోసెఫ్. కొట్టాయం హాస్పిటల్‌లో గుండెపోటుతో మరణించారు ఈయన. మలయాళ సినిమాకు 35 ఏళ్లుగా ఎనలేని సేవలు అందిస్తున్న లెజెండరీ రైటర్ ఈయన. 1985 లో మొదలైన ఈయన ప్రస్థానం.. 2021 వరకు కొనసాగింది. ఈ 35 ఏళ్ల వ్యవధిలో దాదాపు 50 సినిమాలకు కథలు అందించారు డెన్నిస్. ఈయన రాసిన కథలు మలయాళంలో చరిత్ర సృష్టించాయి. మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపీ లాంటి స్టార్ హీరోలందరికీ కూడా ఈయన కథలు అందించారు. అంతేకాదు ఈయన రాసిన కథలకు ఎన్నో అవార్డులు వరించాయి. పాత, కొత్త తరం నటులతో కలిసిపోయి ట్రెండ్‌కు తగ్గట్లు కథలు రాయడం డెన్నిస్ ప్రత్యేకత. 1985లో వచ్చిన ఈరాన్ సంధ్య సినిమాతో ఈయన జర్నీ మొదలైంది. 2021లో వచ్చిన పవర్ స్టార్ సినిమా వరకు కూడా ఈ జర్నీ సాగింది.

అరడజన్ సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఈయన మరణం మలయాళ సినిమాకు తీరనిలోటు అంటూ అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ హీరోలు కూడా ఈయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Malayala Cinema

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు