సినిమా ఇండస్ట్రీలో వరసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. మలయాళంలో వందల సినిమాల్లో నటించిన సీనియర్ నటి కేపీఏసీ లలిత (KPAC Lalitha passes away) ఫిబ్రవరి 22న త్రిపుణితురలో మరణించారు. ఈమె తుది శ్వాస విడిచిన విషయం తెలుసుకుని అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా తమతో అనుబంధం ఉన్న లలిత ఇక లేదని తెలిసి బాధ పడుతున్నారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ లెజెండరీ నటి మలయాళం సినిమా కమర్షియల్ సినిమాలతో పాటు ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ రాణించింది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈమె తన పేరు మార్చుకున్నారు. ఆమె చాలా సంవత్సరాలు సినిమా పరిశ్రమలో పని చేశారు. 50 దశాబ్దాల కెరీర్‌లో 550కి పైగా చిత్రాల్లో నటించింది కవిత. ఒకప్పుడు రోజుకు మూడు షిఫ్టులు కూడా పని చేసిన రోజులున్నాయి.
ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యే వరకు కేరళ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు లలిత. ఆమె ఉత్తమ సహాయ విభాగంలో రెండు జాతీయ అవార్డులు, నాలుగు రాష్ట్ర అవార్డులను గెలుచుకుంది. దివంగత మలయాళ నిర్మాత భరతన్‌కు భార్య ఈమె. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు సిద్ధార్థ్ భరతన్ (Siddharth Bharatan) ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఉన్నాడు.
Extremely saddened to hear about the passing of the legendary KPAC Lalitha aunty.
— Keerthy Suresh (@KeerthyOfficial) February 22, 2022
My heartfelt condolences to the family. pic.twitter.com/nGqxO5tpGb
ఇక ఆమె కుమార్తె శ్రీకుట్టి భరతన్. లలిత మరణ వార్త కేవలం మలయాళ ఇండస్ట్రీని మాత్రమే కాదు సౌత్ అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (prithviraj sukumaran) ఆమె మృతిపై ‘రెస్ట్ ఇన్ పీస్ లలితా ఆంటీ! మీతో వెండితెరను పంచుకోవడం ఒక అదృష్టం! నాకు తెలిసిన అత్యద్భుతమైన నటులలో మీరు కూడ ఒకరు. #KPACLalitha’ అంటూ రాసుకొచ్చారు. ఆయనతో పాటు కీర్తి సురేష్ (Keerthy Suresh), మంజూ వారియర్ (manju warrier) కూడా లెజెండరీ నటి మృతితో ఆమెను తలచుకుని ఎమోషనల్ అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.