Home /News /movies /

MALAYALAM KAPPELA MOVIE TO BE REMADE IN TELUGU HERE ARE THE DETAILS SR

తెలుగులో రీమేక్ కానున్న మరో మలయాళ సినిమా కప్పేలా..

కప్పేలా మూవీ పోస్టర్ Photo : Twitter

కప్పేలా మూవీ పోస్టర్ Photo : Twitter

లాక్ డౌన్ కారణంగా థియేటర్‌లో కాకుండా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన మలయాళ సినిమా కప్పేలా.

    లాక్ డౌన్ కారణంగా థియేటర్‌లో కాకుండా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన మలయాళ సినిమా కప్పేలా. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో దుమ్ములేపుతోంది. ఈ సినిమా చూసిన మన తెలుగు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా తనకు ఈ సినిమా ఎంతో నచ్చిందని పేర్కోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనీ ఇక్కడి నిర్మాతలు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా తెలుగు రైట్స్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటర్‌టైన్ మెంట్స్ దక్కించుకుంది. ఇక కప్పేలాలో అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ నటించి.. తమ నటనతో ఫిదా చేసేశారు. ఈ సినిమా అక్కడ 2020 లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాల జాబితాలో చేరింది. తెలుగులో ఈ సినిమాను ఇద్దరు యువ హీరోలతో తెరకెక్కించనున్నారట. అయితే ఇదే సంస్ధ ఇటీవల మరో మలయాళ సినిమా అయినా `ఆయ్యప్పనుమ్ కోషియమ్` హక్కులను కూడా కొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రవితేజ, రానా హీరోలుగా తెరకెక్కనుంది. ఈ సంస్థ గతంలో `ప్రేమమ్`ను తెలుగులోకి రీమేక్ చేసి విజయం సాధించింది.

    ఇక మరో మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌ తెలుగు రీమేక్ హక్కులను రామ్ చరణ్ కొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రధాన పాత్రలో లూసిఫర్ తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమాను యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Chiranjeevi, Malayala Cinema, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు